ETV Bharat / crime

డీసీఎంను ఢీకొట్టిన బైక్​.. చెలరేగిన మంటలు.. ఒకరు మృతి

డీసీఎంను ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజ్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

fire accident at khanapur in rangareddy district
డీసీఎంను ఢీకొట్టిన బైక్​.. చెలరేగిన మంటలు.. ఒకరు మృతి
author img

By

Published : Feb 2, 2021, 8:51 AM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఎదురుగా వస్తున్న డీసీఎంను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు.

బైక్​ డీసీఎం కిందికి వెళ్లటంతో పెట్రోల్ రోడ్డుపై పడి మంటలు చెలరేగాయి. ద్విచక్ర వాహనం, వ్యానుకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. మృతుడు మహబూబ్​నగర్ జిల్లా గాండీడ్ మండలం చిన్నవార్ గ్రామానికి చెందిన కూర్మయ్య(26) చేవెళ్ల మండల కేంద్రంలోని సీహెచ్ఆర్ పెట్రోల్ బంక్​లో క్యాషియర్​గా పనిచేస్తున్నట్లు గుర్తించారు.

డీసీఎంను ఢీకొట్టిన బైక్​.. చెలరేగిన మంటలు.. ఒకరు మృతి

ఇదీ చదవండి: సర్పంచ్ అభ్యర్థి భర్త అపహరణ.. ఆపై హత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.