హైదరాబాద్ ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. చెత్తకు నిప్పంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ అలుముకోవడం వల్ల చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ కాల్చి పడేయడం వల్ల చెత్త అంటుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆత్మహత్యాయత్నం చేసిన సునీల్ నాయక్ మృతి