ETV Bharat / crime

షార్ట్​ సర్క్యూట్​.. విద్యుత్​ స్తంభానికి చెలరేగిన మంటలు

Fire Accident at Jubilee hills: హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్​ సర్క్యూట్​ కారణంగా విద్యుత్​ స్తంభానికి మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఘటనలో కాసేపు ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

author img

By

Published : Apr 25, 2022, 2:41 PM IST

fire accident in jubilee hills
జూబ్లీహిల్స్​లో అగ్ని ప్రమాదం

Fire Accident at Jubilee hills: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఓ విద్యుత్‌ స్తంభం వద్ద మంటలు చెలరేగాయి. రోడ్ నెంబర్‌- 45 లో ఉన్న ఓ విద్యుత్‌ స్తంభానికి నెట్‌వర్క్‌లకు చెందిన కేబుళ్లు తగిలించారు. గజిబిజిగా ఉన్న కేబుళ్లలో మంటలు చెలరేగి... పెద్దఎత్తున స్తంభానికి వ్యాపించాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు.

రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఘటనలో రోడ్‌నెంబర్‌- 45లో కాసేపు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. మంటలను అదుపు చేసిన అనంతరం ట్రాఫిక్​ పోలీసులు రద్దీని నియంత్రించారు.

ఇవీ చదవండి: Love Failure : ప్రేమ విఫలమైందని.. పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన ఎక్సైజ్​ డైరెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.