Fight betwen BJP and TRS Activists: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన బోనాల సాయి ఉపాధి నిమిత్తం వలస వెళ్లాడు. అయితే అతను సామాజిక మాధ్యమాల్లో తెరాసకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడనే ఉద్దేశంతో అతని ఇంటికి కొంత మంది తెరాస కార్యకర్తలు వెళ్లారు. ఈ విషయం తల్లి తన కొడుకు దృష్టికి తీసుకురాగా బోనాల సాయి పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో తెరాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో పాటు కొంతమంది కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు రావడంతో ఘర్షణ చోటు చేసుకొంది.
ఇరువర్గాలు పరస్పరం పోలీస్ స్టేషన్లోనే దాడులు చేసుకోవడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. రేపాక రాంచంద్రంతో పాటు యేలెందర్‌కు గాయాలయ్యాయి. హుటాహుటిన ఇద్దరిని కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తెరాస నాయకులను బయటికి పంపించి భాజపా వాళ్లు బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నా.. పరస్పరం నినాదాలు చేసుకోవడమే కాకుండా రాళ్లు రువ్వుకొవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదీ చదవండి: