కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని బైరాపూర్ గ్రామంలో సోమవారం అర్థరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భాజపా నాయకులు కత్తులు తీసుకొని వచ్చి ఇంట్లో కుటుంబ సభ్యులను బెదిరించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. భాజపా నేతలతో వాగ్వాదానికి దిగారు. మాటామాట పెరిగి ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినా వినకపోటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
బైరాపూర్కు చెందిన ఓ వ్యక్తి బీజేవైఎంలో ఉన్నారు. ఆయన పార్టీ మారి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ నేత మదన్ మోహన్ రావు జన్మదినం సందర్భంగా ఆయన ఫ్లెక్సీలు కట్టారు. ఇది చూసిన భాజపా నేతలు ఆ వ్యక్తిని ప్రశ్నించారు. అప్పుడు అతను తను కాంగ్రెస్లో చేరినట్లు భాజపా నేతలకు సమాధానమిచ్చారు. దీంతో వివాదం మొదలైంది.
ఇదీ చదవండి: anandaiah medicine: ఆనందయ్య మందుకు సూత్రప్రాయ అనుమతి!