Father rapes daughter in Vikarabad : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కుమార్తె జీవితాన్ని నాశనం చేశాడు. భర్తపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కన్నతల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.
sexual assault on daughter : వికారాబాద్ మండలంలోని ఓ గ్రామానికి తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం పటాన్‌చెరు వెళ్లి అక్కడే ఉంటున్నారు. వీరి కుమార్తె కస్తూర్బాలో చదువుకుంటూ లాక్‌డౌన్ కారణంగా ఇంటికి వచ్చేసింది. తండ్రి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న కూతురును బెదిరించి మూడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
బాలిక నాయనమ్మ మృతి చెందడంతో తల్లిదండ్రులు స్వగ్రామానికి తిరిగి వచ్చి స్థానికంగా కూలీ పనులు చేసుకుంటున్నారు. కూతురు నీరసంగా ఉండటాన్ని గమనించిన తల్లి నాలుగు రోజుల క్రితం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి బాలిక గర్భం దాల్చిందని చెప్పారు. ‘ఎవరినైనా ప్రేమించావా..చెప్పు. వారి పెద్దలతో మాట్లాడి నీకు పెళ్లి చేస్తామని’ గట్టిగా నిలదీసింది. ఏడుస్తూ పటాన్‌చెరులో ఉన్నప్పుడు తండ్రే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని కూతురు చెప్పడంతో ఆమె కన్నీటిపర్యంతమైంది. మంగళవారం రాత్రి తల్లి మోమిన్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.