Father and son died falling into a pond in AP: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓజిలి మండలం గ్రద్ధగుంట గ్రామంలో చెరువులో పశువులను దింపిన చెంగయ్య అనే వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందాడు. నీటి కుంటలో కూరుకుపోయి మృతిచెందిన తండ్రి మృతదేహంకోసం నీటిలోకి దిగిన చెంగయ్యా కుమారుడు నాగార్జున సైతం నీటితో మునిగి మృతి చెందాడు. చెంగయ్య తన పశువులను మేపేందుకు చెరువు గట్టుకు తీసుకు వెళ్లాడు. అనంతరం పశువులను కడిగేందుకు చెంగయ్య వాటితో పాటు చెరువులోకి దిగి గల్లంతయ్యాడు.
తండ్రి ఆచూకీ కోసం చెరువులోకి దిగిన కుమారుడు నాగార్జున నీటిలో మునిగి మృతి చెందాడు. తండ్రీకొడుకులు ఒకే ఘటనలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: