ETV Bharat / crime

Assault on Forest officers : అటవీ సిబ్బందిపై పెట్రోల్‌ పోసిన పోడు రైతులు

అటవీ భూమిలో మొక్కలు నాటేందుకు వెళ్లిన అధికారులు, సిబ్బందిపై పోడు రైతులు పెట్రోల్ పోసి కర్రలతో దాడి చేశారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పంది పంపుల గ్రామంలో చోటుచేసుకుంది.

అటవీ సిబ్బందిపై పెట్రోల్‌ పోసిన పోడు రైతులు

author img

By

Published : Sep 17, 2021, 10:23 AM IST

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పోడు భూముల స్వాధీనానికి వెళ్లిన ఆజంనగర్‌ అటవీశాఖ రేంజ్ అధికారి దివ్య, సిబ్బందిపై.. పోడు సాగుదారులు పెట్రోల్‌ పోసి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పోడు భూముల్లోని మొక్కలు నాటేందుకు గురువారం సాయంత్రం అటవీ అధికారులు.. పందిపంపుల గ్రామానికి వెళ్లారు. తమ భూముల్లో మొక్కలు నాటొద్దని నిరసన చేపట్టిన పోడు సాగుదారులు ఒక్కసారిగా దాడికి దిగారు. పెట్రోల్‌ పోసి కర్రలతో దాడి చేశారు. గతంలోనూ పోడు భూముల్లో అధికారులు నాటిన మొక్కలను.. సాగుదారులు తొలగించారు.

అటవీ సిబ్బందిపై పెట్రోల్‌ పోసిన పోడు రైతులు

దాడి గురించి తెలుసుకున్న అటవీ ఉన్నతాధికారులు పోలీసుల సాయంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన అధికారి దివ్య, సిబ్బందని భూపాలపల్లి ఆస్పత్రికి తరలించారు. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

"పంది పంపుల గ్రామంలో ప్లాంటేషన్​ కోసం వెళ్లిన అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. వారిపై పెట్రోల్ పోసి దాడికి పాల్పడ్డారు. మహిళ అని కూడా చూడకుండా అధికారి దివ్యపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి చేస్తున్నప్పుడు రికార్డు చేసిన వీడియో ద్వారా నిందితులెవరో గుర్తించాం. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం."

- కృష్ణ ప్రసాద్, భూపాలపల్లి ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.