అప్పులబాధ తట్టుకోలేక ఓ రైతు పురుగుల మందు తాగి బలయ్యారు. ఈ విషాదకర ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఏలేటి రామయ్యపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు ఉమ్మనవేన ఎల్లయ్య(65) తనకున్న పొలంలో పత్తి, మిర్చి పంటలు వేశాడు. తన దగ్గర డబ్బులేక.. అప్పులు తీసుకొచ్చి పంటలపై పెట్టుబడి పెట్టాడు. అకాల వర్షానికి పత్తి, మిర్చి పంటలు జాలు పట్టి పాడైంది.
పెట్టిన పెట్టుబడి అంతా వర్షార్పణం కావటం.. అప్పులు అధికమవటంతో ఎల్లయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన పంట పొలం వద్దే పంటకు కొట్టాల్సిన పురుగుల మందును... ఆయనే తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విగతజీవిగా పడి ఉన్న ఎల్లయ్యను చూసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
చనిపోయిన రైతు ఎల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. చిట్యాల పోలీస్స్టేషన్లో కుటుంబసభ్యులు, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: