వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో గుంజల రాజిరెడ్డి అనే రైతు మృతి చెందాడు. రాజిరెడ్డి వరి పంటకు నీరు పెట్టేందుకని పొలానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాజిరెడ్డి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబసభ్యులు పొలానికి వెళ్లారు. తమ వ్యవసాయ బావి సమీపంలోని రిజర్వాయర్ నీటిలో మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.