ETV Bharat / crime

వీఆర్ఓపై కత్తితో దాడి.. ఆ కోపంతోనే!

author img

By

Published : Nov 16, 2022, 5:28 PM IST

Farmer Attacked On VRO IN Pulivendula: గత కొంత కాలంగా ప్రభుత్వ అధికారులపై కత్తులతో దాడులు చేయడం,పెట్రోల్ పోయడం లాంటి వార్తలు చూస్తున్నాం.. అలాంటి ఘటన ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. తన భూమి వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయలేదన్న ఆగ్రహంతో పెద్ద మస్తాన్ అనే రైతు వీఆర్ఓపై కత్తితో దాడి చేశాడు.

Farmer Attacked On VRO IN Pulivendula
Farmer Attacked On VRO IN Pulivendula

Farmer Attacked On VRO IN Pulivendula: ఆంధ్రప్రదేశ్​లోని వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వీఆర్ఓపై ఓ అన్నదాత కత్తితో దాడి చేశాడు. తన భూమి వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయలేదన్న ఆగ్రహంతో రైతు పెద్ద మస్తాన్ వీఆర్ఓపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. సోమవారం కలెక్టరేట్​లో స్పందనలో ఫిర్యాదు చేసి.. తన భూమిని ఆన్​లైన్ చేయాలని అతను కోరాడు. దానిపై విచారించిన పులివెందుల తహసీల్దారు ఆ భూములకు సంబంధించిన అంశాలు హైకోర్టు పరిధిలో ఉన్నందున.. ఆన్​లైన్​ చేయలేమని తెలియజేశాడు.

అయితే ఇవాళ ఉదయం మరోసారి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన పెద్ద మస్తాన్.. తన భూమి ఆన్​లైన్​ చేయాలని పదేపదే విజ్ఞప్తి చేశాడు. దీనికి వీఆర్ఓ కృష్ణమోహన్ నిరాకరించాడు. తన వెంట తెచ్చుకున్న చిన్నపాటి కత్తితో వీఆర్ఓ వీపుపై పొడిచాడు. కృష్ణమోహన్​ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మస్తాన్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి: చీకోటి క్యాసినో కేసులో మంత్రి సోదరులను విచారిస్తున్న ఈడీ

'రూ.50వేలు ఇవ్వు.. లేదంటే ఆమెను చంపేస్తా'.. తల్లికి 4వ తరగతి విద్యార్థి లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.