ETV Bharat / crime

యథేచ్ఛగా నకిలీ విత్తన దందా.. అక్రమార్కులకు కొన్ని కంపెనీల అండ

నాసిరకం విత్తనాల దందా రాష్ట్రం నలుమూలలా మాఫియా తరహాలో అల్లుకుపోయిందని రెండు నెలలుగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు జరుపుతున్న తనిఖీల్లో స్పష్టమవుతోంది. కొందరు వ్యాపారులు, చిన్న విత్తన కంపెనీల యజమానులే కాకుండా, పెద్ద కంపెనీల ఉద్యోగులు కూడా లోపాయికారీగా వీటి అమ్మకాలకు సహకరిస్తున్నారు.

fake seeds, fake seeds sales, fake seeds sales in telangana
నకిలీ విత్తనం, నకిలీ విత్తన దందా, తెలంగాణలో నకిలీ విత్తన దందా
author img

By

Published : Jun 26, 2021, 9:17 AM IST

ఏటా తొలకరి రాగానే నకిలీ విత్తన దందా విచ్చలవిడిగా సాగుతోంది. వ్యవసాయశాఖ పెట్టే కేసులకు ఏ మాత్రం భయపడకుండా అక్రమార్కులు యథేచ్ఛగా నకిలీ విత్తనాలు, గడువు ముగిసిన విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నారు. ఇంతవరకూ ఎవరికీ జైలుశిక్ష పడకపోవడం, విత్తనచట్టం బలహీనంగా ఉన్నందున పట్టుబడినా ఏం కాదులే అన్న ధీమాతో వీరు విక్రయాలు ఆపడం లేదని వ్యవసాయాధికారులే చెబుతున్నారు.

ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలను తెప్పించి తెలంగాణలో విక్రయిస్తున్నారు. ఏపీలోని గుంటూరు, కర్నూలు, కర్ణాటకలోని రాయచూర్‌, బీదర్‌, మహారాష్ట్రలోని నాందేడ్‌ న్రుంచి సరిహద్దు జిల్లాలకు వస్తున్నాయి. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న ఏపీ గ్రామాల్లోని వ్యాపారులు ‘యూఎస్‌ -341’ పేరు గల మిరప విత్తనాల విక్రయాలకు ఏపీ వ్యవసాయశాఖ నుంచి లైసెన్సు తీసుకున్నారు. వీటిని తెలంగాణలోని గ్రామాలకు తరలిస్తున్నారు. ఒక ప్యాకెట్‌లో కేవలం 7 గ్రాముల విత్తనాలను రూ.520కి అమ్ముతున్నారని పెద్దపల్లి జిల్లా వ్యవసాయాధికారి అలివేణి చెప్పారు. పెద్దపల్లి జిల్లా రంగాపూర్‌ శివారులో ఈ వ్యవసాయాధికారి పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారి విచారణలో జయశంకర్‌ జిల్లా మల్హర్‌ మండలం గాదెంపల్లి గ్రామంలోని శ్రీనివాస ఎరువుల దుకాణంలో ఏకంగా 817 విత్తన ప్యాకెట్లు లభించాయి.

  • ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో రూ.6 లక్షల విలువైన యూఎస్‌ -341 మిరప విత్తనాలు దొరికాయి. వాటిని సాగుచేసి నష్టపోయామని ఇదే వెంకటాపురం మండలం రైతులు గత ఏడాది కోర్టుకెళ్లినా వాటిని ఉత్పత్తి చేసిన కంపెనీ పరిహారం ఇవ్వడానికి అంగీకరించలేదు. ఇప్పుడు మళ్లీ అదే మండలంలో అవే విత్తనాలను అక్రమంగా అమ్ముతున్నారు.
  • హైదరాబాద్‌లోని వనస్థలిపురం దగ్గర ద్వారకా సీడ్స్‌ పేరుతో ఓ వ్యక్తి విత్తన వ్యాపారం చేస్తున్నాడు. యథేచ్ఛగా వందల క్వింటాళ్ల విత్తనాలను అమ్మేస్తున్నాడు. గత ఏడాది నాసిరకం విత్తనాలు విక్రయిస్తుంటే వ్యవసాయాధికారులు కేసు పెట్టారు. ఈ ఏడాది వర్షాలు ప్రారంభం కాగానే మళ్లీ పక్క రాష్ట్రాల నుంచి నాసిరకం విత్తనాలు తెచ్చి జిల్లాలకు తరలించి అమ్మడం ప్రారంభించాడు. ఈసారి పోలీసులు అతని చరిత్రపై లోతుగా విచారణ చేయిస్తే కొన్నేళ్లుగా నాసిరకం విత్తనాలు అమ్ముతున్నట్లు తేలింది. ఇతని వ్యాపారం తీరు పోలీసులనే ఆశ్చర్యపరిచింది.

పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన స్థానిక రాజకీయ నేత పిట్టల రవికుమార్‌ మరికొందరితో నాసిరకం విత్తనాల వ్యాపారం సాగిస్తున్నట్లు విచారణలో స్పష్టంగా తేలింది. ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన బాచిన వెంకన్న నుంచి విత్తనాలు తెచ్చి ఆదిలాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో ఏజెంట్లను నియమించుకుని మరీ అమ్మిస్తున్నారు. రవికుమార్‌పై మూడు కేసులు నమోదయ్యాయి.

హెచ్‌టీ పత్తి విత్తనాలు అధికం..

జన్యుమార్పిడితో కలుపు మొక్కలను చంపేందుకు వాడే విషపూరిత గ్లైఫోసైట్‌ రసాయన మందులను తట్టుకుని బతికే (హెర్బిసైట్‌ టాలరెంట్‌-హెచ్‌టీ) పత్తి విత్తనాలను గుజరాత్‌, ఏపీ, కర్ణాటకల నుంచి ఎక్కువగా తెచ్చి తెలంగాణలో విక్రయిస్తున్నారు. కలుపు తీయడానికి కూలీల ఖర్చు అధికంగా ఉంటున్నందున ఈ విత్తనాలను నాటి రసాయనాలను చల్లితే కలుపుతో సహా అన్ని మొక్కలు మాడి చనిపోతాయని, పత్తి మొక్కలు మాత్రమే బతుకుతాయని వ్యాపారులు ప్రచారం చేస్తున్నారు. హెచ్‌టీ పత్తి విత్తనాలకు కేంద్రప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా, విచ్చలవిడిగా అమ్ముతున్నారు. పత్తి విత్తనాలను 450 గ్రాముల చొప్పున ప్యాక్‌ చేసి కంపెనీ వివరాలతో సహా ముద్రించి అమ్మాలి. కానీ బస్తాల్లో విడిగా తెచ్చి విక్రయిస్తున్నారు. వీటిని కొంటే కచ్చితంగా నష్టపోతారని, హెచ్‌టీ రకం వంగడాలనే ఇలా అమ్ముతున్నారని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.

లైసెన్సు రద్దయినా అవే విత్తనాలు..

మిరప పంటలో ‘యుఎస్‌-341’ విత్తనాలను తెలంగాణలో అమ్మవద్దని వ్యవసాయశాఖ గత ఏడాదే టోకు విక్రయ లైసెన్సును రద్దు చేసింది. పాత ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో గతంలో ఈ విత్తనాలు కొని నాటిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిరప పంట ఏపుగా పెరిగిన తరువాత పూత, కాత రాక తెగుళ్లబారిన పడి రైతులు నష్టపోయినందున తెలంగాణ వాతావరణానికి ఇవి అనుకూలం కాదని లైసెన్సు రద్దు చేసినట్లు వ్యవసాయశాఖ రాష్ట్ర విత్తన విభాగం అధికారి శివప్రసాద్‌ ‘ఈనాడు’కు చెప్పారు. అవే విత్తనాలను పెద్దయెత్తున తెచ్చి ఇప్పుడురైతులకు అక్రమంగా అమ్ముతుంటే పోలీసులు పట్టుకున్నారు. ఈ విత్తనాలను ‘బీఏఎస్‌ఎఫ్‌’ అనే పేరు గల ప్రైవేటు కంపెనీ తయారు చేస్తోంది. ఈ కంపెనీ సేల్స్‌ మేనేజర్‌ బాబూరావు అక్రమంగా అమ్ముతున్నట్లు తేలింది.

పీడీ చట్టం కింద జైలుకు పంపుతాం

నాసిరకం విత్తనాలు అమ్మితే ఏం కాదులే అని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఎంతటివారైనా వదిలిపెట్టకుండా జైలుకు పంపాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కొన్నేళ్లుగా ఇదే వ్యాపారాన్ని అలవాటుగా మార్చుకున్న ఏడుగురిపై ఈ సీజన్‌లో ఇప్పటికే పీడీ చట్టం కింద కేసులు పెట్టి అరెస్టు చేశాం. 2017 నుంచి ఇప్పటివరకూ నాసిరకం విత్తనాలు అమ్ముతున్నవారిపై 32 పీడీ చట్టం కేసులు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ముమ్మర తనిఖీల కోసం పోలీసు, వ్యవసాయాధికారులతో ఏర్పాటు టాస్క్‌ఫోర్స్‌ బృందాలను చేశాం.

- వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.