మహారాష్ట్ర నుంచి భారీగా నకిలీ విత్తనాలను తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 400 నకిలీ విత్తనాల పాకెట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపనపల్లి అంతర్రాష్ట్ర వంతెన వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా దొరికారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.3 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి కోటపల్లి, చండూరు మండలాల్లో ప్రజలకు ఎక్కువ ధరలకు విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు శేషారావు, ప్రకాశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ జైపూర్ నరేందర్ తెలిపారు.