హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని రెయిన్బో ఆస్పత్రికి ఓ గుర్తు తెలియని వ్యక్తి.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేరిట ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. తాను కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడిగా పేర్కొన్న ఆగంతకుడు.. తన పేరు తిరుపతిరావు అని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని ఫోన్ చేశాడని ఆస్పత్రి మేనేజర్ దీపక్ కుమార్ తెలిపారు.
మీడియాకు అడ్వర్జైజ్‌మెంట్, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడానికి డబ్బులు కావాలని అడిగినట్లు దీపక్‌కుమార్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆర్డీఎస్ నుంచి చుక్క నీటి బొట్టును వదులుకోం: సంపత్