Fake Notes Gang Arrest: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దొంగనోట్ల ముఠాదారులు.. చర్ల మండలం తేగడా, కలివేరు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి గత కొంత కాలంగా దొంగ నోట్లు తయారు చేస్తున్నారు. తయారు చేసిన నోట్లను స్థానికంగా ఉన్న కొంత మంది వ్యక్తులతో కలిసి చలామణి చేస్తున్నారు. అమాయక ఆదివాసీలే లక్ష్యంగా.. ఈ దొంగనోట్లను చలామణి చేస్తున్నట్టు విచారణలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. నిన్న(జూన్ 7) రాత్రిపూట ఈ ముఠా కారులో వెళ్తుండగా.. చర్లలో పోలీసులు తనిఖీ చేయగా దొంగనోట్లు పట్టుబడ్డాయి. అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది.
నిందితుల నుంచి 51 వేల 5500 విలువ గల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 200, 500, 2000 నోట్లతో పాటు నోట్లు తయారు చేసే కంప్యూటర్, ప్రింటర్ లాంటి పరికరాలతో పాటు వాళ్లు ప్రయాణిస్తున్న కారును కూడా స్వాధీనపర్చుకున్నామని తెలిపారు. మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేయగా.. అందులో ఓ మైనర్ బాలుడు, ఒక యువతి ఉన్నట్లు భద్రాచల ఎస్పీ రోహిత్ తెలిపారు.
ఇవీ చూడండి: