Fake mails in the name of AIIMS Director: వారంతా ఎంబీబీఎస్ సీట్ల కోసం ఎదురుచుస్తున్న విద్యార్థులు. వారిలో కొంతమంది తమకు సీటు రానివారు సైతం ఉన్నారు. అలాంటి వారికి ఎరవేసి డబ్బులు సంపాదించాలనుకున్నారు సైబర్ నేరగాళ్లు. అనుకున్నదే తడువుగా మంగళగిరి ఎయిమ్స్ పేరుతో నకలీ మెయిల్ సృష్టించారు. ఎంబీబీఎస్ సీట్లు ఇస్తామంటూ కొందరు అభ్యర్ధులకు ఫోన్ కాల్స్, మెయిల్స్ పంపారని తెలపడంతో అధికారులు స్పందించారు.
ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న ఎయిమ్స్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎయిమ్స్ డైరెక్టర్ పేరుతో నకిలీ మెయిల్ క్రియేట్ చేశారని గుర్తించామన్నారు. డైరెక్టర్ పేరుతో ఫోన్ కాల్స్ గానీ, మెయిల్స్ గానీ వస్తే ప్రజలు నమ్మొద్దని ప్రకటనలో తెలిపారు. ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ కేవలం ప్రభుత్వం నిర్దేశించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారానే జరుగుతుందని ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం సంబంధిత అధికార వెబ్ సైట్లోనే చూడాలని కోరారు.
ఇవీ చదవండి: