Fake insurance gang arrest: నకిలీ వాహన భీమా పాలసీలు చేస్తున్న ముఠాగుట్టును వరంగల్ పోలీసులు రట్టు చేశారు. నకిలీ దందా నిర్వహించే వారితోపాటు దళారీలతో సహా మొత్తం పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4,46,000 నగదు, 3 ల్యాప్ ట్యాప్‌లు, 4 ప్రింటర్లు, 5 ద్విచక్ర వాహనాలు, పది ఫోన్లు, 433 వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు కార్డులు, రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు, నకిలీ బీమా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
warangal cp tarun joshi: నిందితులందరూ వాహన బీమా, రోడ్డు రవాణా శాఖ దళారీలుగా వరంగల్ రోడ్డు రవాణా శాఖ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో పని చేస్తున్నారని వరంగల్ పోలీస్ కమినర్ తరుణ్ జోషి అన్నారు. వాహన బీమాకు సంబంధించి రెన్యూవల్ చేయించడం, వాహన రిజిస్ట్రేషన్ , లైసెన్సులు ఇప్పించే వారని సీపీ తెలిపారు. అయితే ఆదాయం సరిపోకపోవడంతో నకిలీ బీమా రెన్యువల్‌పై దృష్టి సారించారని పేర్కొన్నారు. దీనికోసం పలు యాప్స్, సాఫ్ట్వేర్లను సేకరించి అమయాక ప్రజలను మోసం చేసేవారని అన్నారు. దీనికి వాహనదారుల నుంచి 2 నుంచి 10 వేల రూపాయాలు వసూలు చేసే వారని సీపీ పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కార్యాలయాలపై దాడులు చేసి అరెస్టు చేశారు. సుమారు 90 లక్షల రూపాయాలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని సీపీ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Attack on forest officers: అటవీశాఖ అధికారులపై గిరిజనుల దాడి