ETV Bharat / crime

Explosion: వికారాబాద్ జిల్లాలో పేలుడు కలకలం... ఒకరికి తీవ్ర గాయాలు..

వికారాబాద్ జిల్లా పెద్దేముల్​లోని ఓ ఇంటిముందు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్పందించిన స్థానికులు వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

author img

By

Published : Jul 25, 2021, 1:17 PM IST

explosion-in-suspicious-condition-at-peddemul-mandal-vikarabad-district
పెద్దేముల్​లో పేలుడు.. ఒకరికి తీవ్ర గాయాలు..

వికారాబాద్ జిల్లా పెద్దేముల్‌ మండల కేంద్రంలోని ఓ ఇంటి ముందు అనుమానాస్పద స్థితిలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వెంకట్‌ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

డీఎస్పీ లక్ష్మీనారాయణ, గ్రామీణ సీఐ జలంధర్ రెడ్డిలు... పేలుడు ఎలా సంభవించింది, అసలేం పేలిందన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. స్థానిక ప్రజలను ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే పేలుడుపై పూర్తి వివరాలు తెలుసుకుంటాని పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: సమయానికి రమ్మన్నారని.. ప్రధానోపాధ్యాయురాలిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.