ETV Bharat / crime

కల్లు దుకాణాలపై అధికారుల రైడ్స్.. 'కల్తీ అని తేలితే కఠిన చర్యలు' - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

నిజామాబాద్ జిల్లా జానకంపేట గ్రామంలోని కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. కల్లు నమూనాలను సేకరించారు. కల్తీ అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

excise-officers-rides-at-jankampet-edapally-mandal-in-nizamabad-district
కల్లు దుకాణాలపై అధికారుల రైడ్స్.. 'కల్తీ అని తేలితే కఠిన చర్యలు'
author img

By

Published : Mar 22, 2021, 5:05 PM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో కల్లు దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. కల్తీ కల్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో హైదరాబాద్‌కు చెందిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం గ్రామంలోని దుకాణాల్లో సోదాలు చేసింది. కల్లు నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపిస్తామని.. నివేదికల్లో కల్తీ అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

జానకంపేట గ్రామంలో కొంతకాలంగా కల్తీ కల్లు వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోందని... ఇంటింటికి తిరిగి కల్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కల్తీ కల్లు విక్రయాలపై నిఘా ఏర్పాటు చేశామన్నారు.

ఇదీ చదవండి: సులేమాన్‌ నగర్‌ నిందితుడు అరెస్ట్.. 50 తులాల బంగారం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.