ETV Bharat / crime

'తెలిసీ తెలియక అప్పులు చేశా.. వాటిని తీర్చలేక చనిపోతున్నా'

author img

By

Published : Aug 5, 2022, 8:49 AM IST

BTech Student Suicide in Hyderabad : ‘తెలిసీ తెలియక అప్పులు చేశా... వాటిని తీర్చేలేకపోతున్నా.. చాలా అబద్ధాలు చెప్పా.. నా మాటలన్నీ నాటకమే.. దయచేసి అర్థం చేసుకోండి.. అమ్మా, నాన్న, గుడి, తమ్ముళ్లు జాగ్రత్త’ అంటూ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

BTech Student Suicide in Hyderabad
BTech Student Suicide in Hyderabad

BTech Student Suicide in Hyderabad : సూసైడ్ ఈజ్ నాట్ ఏ పర్మినెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరరీ ప్లాబ్లమ్స్.. తాత్కాలిక సమస్యలకు ఆత్మహత్య అనేది శాశ్వత పరిష్కారం కాదు అని దీని అర్థం. కానీ ఈ విషయం తెలిసినా.. చాలా మంది క్షణికావేశంలో వారి ప్రాణాలు తీసుకుంటున్నారు. కారణం చిన్నదైనా పెద్దదైనా ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నారు. కన్నవాళ్ల గురించి కాస్త కూడా ఆలోచించకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

లవ్ ఫెయిల్యూర్, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, అప్పుల పాలవ్వడం ఇలా రకరకాల కారణాలతో నేటి యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పదేళ్ల బాలుడి నుంచి పండుముసలి వారి వరకు తమ సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారమని భావించి ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్​ నగరంలో చోటుచేసుకుంది.

Engineer Suicide in Hyderabad : గోపాలపురం సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్‌ వివరాల ప్రకారం.. వరంగల్‌ కాశీబుగ్గకు చెందిన మామిడి లక్ష్మిసాయి(22) బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంటర్వ్యూ ఉందని గతనెల 31న నగరానికి వచ్చాడు. గురుద్వారా ప్రాంతంలోని లోటస్‌ గ్రాండ్‌ హోటల్‌లో దిగాడు. రెండురోజుల నుంచి కనిపించలేదు. అద్దె చెల్లించకపోవడంతో గురువారం రూమ్‌ బాయ్‌ శ్యామ్‌ తలుపు కొట్టాడు. లక్ష్మీసాయి స్పందించకపోవడంతో హోటల్‌ యజమానికి చెప్పగా.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. గది తలుపులు బద్ధలుకొట్టి చూడగా బాత్‌రూమ్‌లో బైండింగ్‌ వైర్‌తో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.

అతని వద్ద సూసైడ్‌ నోటు లభ్యమైంది. ‘తెలిసీ తెలియక అప్పులు చేశా... వాటిని తీర్చేలేకపోతున్నా.. చాలా అబద్ధాలు చెప్పా.. నా మాటలన్నీ నాటకమే.. దయచేసి అర్థం చేసుకోండి.. అమ్మా, నాన్న, గుడి, తమ్ముళ్లు జాగ్రత్త’ అని సూసైడ్ నోట్​లో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి చివరి ఫోన్‌కాల్‌ ఉండటంతో అదేరోజు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునని భావిస్తున్నారు. సూసైడ్‌నోట్‌ ఆధారంగా అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.