వనపర్తి జిల్లా కేంద్రం గాంధీనగర్‌లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లావణ్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ ఫీజు కట్టలేక తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగాలేదని సెల్ఫీ వీడియో తీసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కి చెందిన వెంకటయ్య, ఈశ్వరమ్మల కూతురు లావణ్య సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున తన చదువు వారికి భారం కాకూడదని... సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
మృతి చెందిన విద్యార్థిని లావణ్య... హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. మంగళవారం ఎగ్జామ్ ఉన్నందున తల్లిదండ్రులను డబ్బులు కావాలని అడిగింది. తల్లిదండ్రులు ఎవరెవరినో అడుగుతుంటే వారి ఇబ్బందిని గమనించి... సెల్ఫీ వీడియోలో ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: త్వరలో కేసీఆర్ మరో కొత్త పథకం.. భారీగా నిధుల కేటాయింపు!