Ganja Seized: రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా భారీస్థాయిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్లలో తరలిస్తున్న 320 కేజీల గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు పట్టుకున్నారు. దాని విలువ దాదాపు రూ.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఒడిశా టూ మహారాష్ట్ర: ఒడిశా నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నట్లు నిందితులు తెలిపారు. మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరంతా మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద నుంచి 9 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ తరలించిట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారి తిరుపతి తెలిపారు. వారిపై రెండు కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఇవీ చూడండి:నిప్పంటించుకుని తల్లీకుమారుడు ఆత్మహత్య.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..