ETV Bharat / crime

Employee Steals Gold From Bank : తాకట్టు పెట్టిన బంగారం మరొకరికి తనఖా.. పందేలు కాసి చివరకు.. - Employee Steals Gold From Bank

Employee Steals Gold From Bank : అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేయడం అంటే ఇదేనేమో. ఓ వ్యక్తి తాను పనిచేస్తున్న సంస్థకు టోపీ పెట్టాడు. ఆ సంస్థలో బంగారు ఆభరణాలు కాజేసి.. మరో ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. ఆ వచ్చిన డబ్బుతో పందేలు కాసి ఉన్నది కాస్తా పోగొట్టుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

Employee Stole Gold From Bank
బంగారం దోపిడి
author img

By

Published : Feb 16, 2022, 11:47 AM IST

Employee Steals Gold From Bank : రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలో ఓ ఫైనాన్షియల్ సంస్థలో పనిచేసే ఉద్యోగి తన సంస్థకే టోపీ పెట్టాడు. చేతికి వచ్చిన నగదుతో పందేలు కాసి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు.

అసలేం జరిగిందంటే..

Employee Steals Gold From Bank in Rangareddy : రంగారెడ్డి జిల్లా నాగారంలోని ఓ ప్రముఖ పైనాన్షియల్ సంస్థ బంగారు ఆభరణాల తాకట్టుతో రుణాలు అందజేస్తుంది. అక్కడ రంజిత్ కుమార్ అనే వ్యక్తి అప్రైజర్​గా పనిచేస్తున్నాడు. బంగారం భద్రపరిచే గది తాళం చెవి అతడి వద్ద కూడా ఒకటి ఉంటుంది. దాన్ని అవకాశంగా మలచుకొని అక్కడ తాకట్టు పెట్టిన 130కు పైగా ప్యాకెట్లలోని బంగారాన్ని కాజేశాడు.

ఆ బంగారాన్ని మరో ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టి సుమారు 4కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నాడు. ఆ డబ్బంతా పందేలు కాసి పోగొట్టుకున్నాడు. మంగళవారం రోజు ఈ విషయం బయటపడటంతో రంగంలోకి దిగిన కీసర పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాకట్టు పెట్టిన బంగారంతో వచ్చిన రుణాన్ని బెట్టింగ్ యాప్​లో పోగొట్టుకున్నానని నిందితుడు రంజిత్ పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు. బంగారు ఆభరణాలను ఒక్కడే తప్పించాడా.. మరెవరైనా సాయం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:రెచ్చిపోయిన దొంగలు.. రెండు ఇళ్లను ఊడ్చేసి.. మరో ఇంట్లో..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.