ETV Bharat / crime

ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి.. ఎక్కడో కాదు మన దగ్గరే.!

Electric bike Battery Blast
ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి
author img

By

Published : Apr 20, 2022, 12:39 PM IST

Updated : Apr 20, 2022, 7:41 PM IST

12:35 April 20

Electric bike Battery Blast : ఛార్జింగ్ పెడుతుండగా పేలిన ఎలక్రిక్ బైక్ బ్యాటరీ

Electric bike Battery Blast
ప్రకాశ్​ కుటుంబం వినియోగిస్తున్న ఎలక్ట్రిక్​ బైక్​

Electric bike Battery Blast : పర్యావరణానికి హాని కలగకూడదనే ఉద్దేశంతో వినియోగిస్తున్న ఎలక్టిక్​ బైక్​ వారి ప్రాణాలమీదకు తెచ్చింది. ఒకే కుటుంబంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకే జిల్లాలో అనతి కాలంలోనే ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. అసలేం జరిగింది.. ఇది ఎక్కడంటే..

నిజామాబాద్ నగరంలోని ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నగరంలోని సుభాష్ నగర్​లో మంగళవారం రాత్రి జరిగింది. ఏడాదిన్నరగా ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్​ బైక్​కు సంబంధించిన బ్యాటరీని రోజు లాగానే అర్ధరాత్రి సమయంలో ఛార్జింగ్ పెట్టి పడుకున్న కొన్ని గంటల్లోనే అది పేలిపోయింది. ఘటనలో ఇల్లంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇంట్లోని మిగతా విద్యుత్​ ఉపకరణాలకు మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది.

ప్రమాద సమయంలో గాఢ నిద్రలో ఉన్న ఇంటి సభ్యుల్లో వృద్ధుడు రామస్వామి(80) తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం​ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని భార్య కమలమ్మకు సైతం తీవ్రగాయాలయ్యాయి. స్వల్పంగా కాలిన గాయాలతో ఉన్న కోడలు, మనుమడికి కమలమ్మతో పాటు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొత్తం ఇంట్లో ఐదుగురు ఉండగా మృతుడి కుమారుడు ప్రకాశ్​ సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవల నందిపేట్ మండలంలో విద్యుత్ ద్విచక్ర వాహనం కూడా ఇలాగే కాలిపోయింది.

ఇవీ చదవండి : 'కేజీఎఫ్' థియేటర్​లో..​ కాలు తాకిందని కాల్చేశాడు..

Last Updated : Apr 20, 2022, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.