Secretariat Employee Suicide Attempt : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు సచివాలయ ఉద్యోగిని ప్రసన్న ఆత్మహత్యకు యత్నించారు. గ్రామంలోని కొందరు వైకాపా మద్దతుదారులు నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కొనుగోళ్లకు గోతాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె వాపోయారు. ఒత్తిళ్లకు తాళలేక పురుగుల మందు తాగినట్లు పేర్కొన్నారు. ప్రసన్నను నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.
ఆడపిల్లగా ఏం చేయలేక
"నేను ఏల్చూరులో సెక్రటేరియట్ ఉద్యోగినిగా పనిచేస్తున్నాను. శ్రీనివాస రెడ్డి అనే రైతు.. గోతాల కోసం ఒకతని ద్వారా ఫోన్ చేయించి మాట్లాడించారు. గోతాలు ఇస్తామని చెప్పాం. ఇంకా ధాన్యం సేకరణ మొదలుపెట్టకముందే మా వడ్లు కొనాలని బలవంతం చేశారు. సమాధానం చెప్తున్నా కూడా వినకుండా నువ్వెలా ఉద్యోగం చేస్తావో చూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆడపిల్లగా నేనేమేం చేయలేక ఆత్మహత్యకు యత్నించాను." -- ప్రసన్న, బాధితురాలు
ఇదీ చదవండి : CP Stephen on Drugs Gang Arrest : గంజాయి తరలింపు ముఠా అరెస్టు.. పరారీలో సూత్రధారులు