ETV Bharat / crime

'సంబంధం ఉందని భావిస్తే నోటీసులు వచ్చేస్తున్నాయ్..'

Delhi Liquor offerings case Update: దిల్లీ మద్యం ముడుపుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ మూలాల్లోకి వెళ్తోంది. కేసుతో సంబంధం ఉన్న ప్రైవేట్‌ ఉద్యోగులు మొదలు డ్రైవర్ల వరకూ ఎవరినీ వదిలిపెట్టట్లేదు. ముడుపులతో సంబంధం ఉందని భావిస్తున్న పెద్దలతో సన్నిహితంగా ఉంటారని తెలిస్తే అనధికారికంగానైనా విచారిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు దొరికితే నోటీసులు పంపుతున్నారు. ఆ విధంగా ఇప్పటికే దాదాపు పదిమందిని విచారించారు. ఇందులో ఇటీవల వివాదాస్పదమైన ఓ నిర్మాణ సంస్థకు చెందిన యజమాని ఉండటం గమనార్హం.

Delhi Liquor offerings case Update
Delhi Liquor offerings case Update
author img

By

Published : Oct 22, 2022, 9:22 AM IST

Updated : Oct 22, 2022, 10:01 AM IST

'సంబంధం ఉందని భావిస్తే నోటీసులు వచ్చేస్తున్నాయ్..'

Delhi Liquor offerings case Update: దిల్లీ లిక్కర్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన బోయినపల్లి అభిషేక్‌ను సీబీఐ అరెస్టుచేయగా ఈడీ పలుసార్లు తనిఖీలు చేసింది. కేసుతో సంబంధం ఉందని భావించిన వారికి నోటీసులిచ్చి దిల్లీలో విచారిస్తున్నారు. మద్యం ముడుపుల వ్యవహారం చిన్నదే అయినా ఈడీ దర్యాప్తులో అనేక డొల్ల కంపెనీల బాగోతం బయటపడింది. కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న అనేకమంది పెద్దలు నల్లధనాన్ని చట్టబద్దం చేసేందుకు వేర్వేరు కంపెనీలలోకి మళ్లించి, వాటిని ఆదాయంగా చూపించినట్లు దర్యాప్తులో తేలింది. డొల్లకంపెనీలు, వాటి ద్వారా జరిగిన లావాదేవీలకి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పెద్దమొత్తంలో వివరాలు సేకరించింది. ఆ సమాచారం ఆధారంగానే కేసు మూలాల్లోకి వెళ్లి దర్యాప్తు చేస్తోంది.

ఆ ఖాతాలో రూ.50కోట్ల లావాదేవీలు: కొందరు ప్రముఖులు డ్రైవర్లను బినామీలుగా పెట్టుకొని, వారి ఖాతాల్లో డబ్బు జమచేసి, మళ్లీ అక్కడ నుంచి వేరేఖాతాల్లోకి మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో బయటపడినట్లు సమాచారం. గురువారం మహబూబాబాద్‌లో ఇద్దరి ఇంటికెళ్లి అధికారులు ప్రశ్నించారు. అంతకుముందే సేకరించిన ఆధారాలను చూపించి వారిని ప్రశ్నించారు. అందులో ఒకరు రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధికి సన్నిహితంగా ఉండేవాడని అతని ఖాతా ద్వారా 50 కోట్ల వరకూ లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. అలానే ఆ వ్యక్తికి డ్రైవర్‌గాగా వ్యవహరించే మరో వ్యక్తిని ప్రశ్నించారు. అతని ఖాతా ద్వారా పెద్దమొత్తంలో లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించిందని సమాచారం.

వారితో పాటు హైదరాబాద్‌లో అనేకమందిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అందులో నిర్మాణరంగంలో ఉండి, ఇటీవల ఆరోపణలు ఎదుర్కొన్న ఓ ప్రముఖుడు ఉన్నట్లు, అతని ద్వారా పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయని గుర్తించినట్లు సమాచారం. ఆయన ద్వారా డబ్బు ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్లిందో చెప్పమని అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

బినామీ ఖాతాల ద్వారా నిధుల బదిలీ నేరమే: నగరంలో ఓ ఖరీదైన మద్యం దుకాణం యజమానితో పాటు మరో మద్యం వ్యాపారిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. వారంతా మద్యం ముడుపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్నాయని.. వారిద్వారా వేర్వేరు సంస్థల్లోకి నగదు ప్రవాహం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దర్యాప్తులో డొల్లకంపెనీలు, బినామీ ఖాతాలకు సంబంధించి పెద్దమొత్తంలో సమాచారం లభించిందని, మద్యం ముడుపులతో సంబంధం ఉన్నా లేకపోయినా బినామీ ఖాతాల ద్వారా నిధులు బదిలీ నేరమే కాబట్టి ఆ కోణంలోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:

Last Updated : Oct 22, 2022, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.