ETV Bharat / crime

Tollywood Drugs case: 12 మందికి ఈడీ నోటీసులు.. రేపు విచారణకు పూరీ జగన్నాథ్! - తెలంగాణ వార్తలు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో(Tollywood Drugs case) రేపట్నుంచి ఈడీ(ED) విచారణ జరపనుంది. సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా దర్శకుడు పూరీ జగన్నాథ్(Puri Jagannadh) రేపు విచారణకు హాజరుకానున్నారు.

ed-investigation-start-from-tomorrow-and-notices-to-12-people-from-the-telugu-film-industry

author img

By

Published : Aug 30, 2021, 1:38 PM IST

Updated : Aug 30, 2021, 2:34 PM IST

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో(Tollywood Drugs case) ఈడీ(ed) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మనీలాండరింగ్ కేసు(Money laundering case) నమోదు చేసిన ఈడీ అధికారులు... దర్శకుడు పూరి జగన్నాథ్‌ను(Puri Jagannadh) రేపు ప్రశ్నించనున్నారు. ఈ మేరకు ఆయనకు ఈడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. రేపు ప్రారంభమయ్యే విచారణ సెప్టెంబర్ 22 వరకు కొనసాగనుంది. సినీ పరిశ్రమకు చెందిన 12మందికి నోటీసులు జారీ చేశారు. నిర్ధేశించిన తేదీల్లో విచారణకు హాజరుకావాలని సూచించారు.

11 నేరాభియోగ పత్రాలు

టాలీవుడ్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేసిన ఆబ్కారీ శాఖ సిట్ అధికారులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరితోపాటు మరికొంత మందిపై విచారణ జరిపే అవకాశం ఉంది. డ్రగ్స్ కేసులో ఆబ్కారీ శాఖ సిట్ అధికారులు మొత్తం 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఇందులో 12మంది సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు... మరో 50మందిని విచారించారు. ఇప్పటివరకు 11 నేరాభియోగపత్రాలు దాఖలు చేశారు.

ప్రస్తావన లేదు

అభియోగపత్రాల్లో ఆఫ్రికా దేశాలకు చెందిన మత్తు మందు సరఫరాదారులతో పాటు... స్థానికంగా డ్రగ్స్ విక్రయించే వ్యక్తులున్నారు. 12మంది సినీతారల గోర్లు, తల వెంట్రుకల నమూనాలు సైతం సేకరించిన ఆబ్కారీ అధికారులు.... ఎక్కడ కూడా వాళ్ల ప్రస్తావన తీసుకురాలేదు. ప్రస్తుతం మనీలాండరింగ్ చట్టం(Money laundering) కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు సైతం... 12మంది సినీరంగానికి చెందిన వారిని సాక్ష్యాలుగానే ప్రశ్నించే అవకాశం ఉంది. మనీలాండరింగ్ జరిగినట్లు తేలితే ఆ వ్యక్తులపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఫ్రెండ్​ను నమ్మి వెళ్లడమే ఆ బాలిక తప్పు.. ఏడుగురు కలిసి...

Last Updated : Aug 30, 2021, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.