ETV Bharat / crime

ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తప్పించుకునేందుకు స్మగ్లర్లు యత్నం - శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వార్తలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు స్మగ్లర్ల తాకిడి రోజురోజుకు పెరిగిపోతోంది. అక్రమార్కుల ఆటకట్టించేందుకు అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేసినా... ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న బంగారం, మాదక ద్రవ్యాలు తనిఖీల్లో నిత్యం బయటపడుతున్నాయి. ఈ ఒక్క నెలలోనే వంద కోట్ల విలువైన మత్తు పదార్థాలతోపాటు ఇతర వస్తువులు నిఘా సంస్థలకు పట్టుబడ్డాయి.

shamshabad airport
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు
author img

By

Published : Jun 25, 2021, 4:26 AM IST

హైదరాబాద్‌కు అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతోంది. ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్న అక్రమార్కులు.... మితీమీరిన తెలివితేటలు, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా సంస్థల కళ్లు గప్పి... గమ్యానికి చేరేందుకు యత్నిస్తున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో వరసగా అక్రమ రవాణాదారులు పట్టుబడుతున్నా.... స్మగ్లింగ్‌ మాత్రం ఆగటంలేదు. కరోనా తీవ్రత తగ్గుతున్నందున.... స్వదేశీ, విదేశీ విమానయానాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఇదే సమయంలో విదేశాల నుంచి అక్రమ రవాణా కూడా పెరుగుతోంది. బంగారం, మత్తుపదార్థాలు, విదేశీ కరెన్సీ, ఐఫోన్ల వంటి వస్తువులను అక్రమంగా తీసుకువస్తూ.... నిఘా సంస్థలకు పట్టుబడుతున్నారు. వీరిలో ఎక్కువగా కొరియర్లే ఉంటున్నందున... కేసుల దర్యాప్తులో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

12 కిలోల హెరాయిన్‌ పట్టివేత

ఎయిర్‌పోర్టులో లగేజి స్కానింగ్‌ చేసినా... పట్టుబడకుండా ఉండేందుకు కొత్తఎత్తులు వేస్తున్నారు. ఆఫ్రికన్‌ దేశాల నుంచి మాదకద్రవ్యాలు, గల్ఫ్‌ దేశాల నుంచి బంగారం, ఇతర వస్తువులు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈనెల 5, 6 తేదీల్లో జింబాబ్వేకి చెందిన ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి 78 కోట్ల రూపాయల విలువైన 12 కిలోల హెరాయిన్‌...డీఆర్​ఐ అధికారులకు పట్టుబడింది. ఈనెల 21న జోహన్స్‌బర్గ్‌ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి 19.6 కోట్లు విలువైన 3కిలోల హెరాయిన్‌ను డీఆర్​ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం షార్జా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను, వారి నుంచి ఐఫోన్‌లు తీసుకునేందుకు వచ్చిన మరొకరిని కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 4 లక్షల రూపాయల నగదుతోపాటు కోటి రూపాయలు విలువైన కొత్త మోడళ్లకు చెందిన 80 ఐఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

పెరిగిన నిఘా

పెరుగుతున్న స్మగ్లింగ్‌ దృష్ట్యా... విదేశాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. విదేశీ ప్రయాణికులతోపాటు స్వదేశీ ప్రయాణికుల రాకపోకలపై కూడా డీఆర్​ఐ కస్టమ్స్‌, సీఐఎస్​ఎఫ్​ అధికారులు నిఘా పెంచారు. ప్రయాణికుల జాబితాలో ఉన్నవారు తరచూ రాకపోకలు సాగించిన వారిని గుర్తించి, అనుమానితుల జాబితా సిద్ధం చేస్తున్నారు. విమానాశ్రయంలో దిగగానే... వారి వ్యవహార శైలిపై దృష్టిసారిస్తూ.... ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: ఎలక్ట్రానిక్‌ వాహనాల రంగంలో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.