drinkers fighting:కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో గల 3వ నెంబర్ కల్లు దుకాణం వద్ద ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. కల్లు దుకాణం మందుబాబులకు అడ్డాగా మారింది. మంగళవారం కొంత మంది తాగిన మైకంలో ఒకరినొకరు తలలు పగిలేలా సీసాలు, కర్రలతో విచక్షణ రహితంగా కొట్టుకున్నారు.
కల్లు దుకాణం ఉండడం వల్లే రోజు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని.. జన నివాసాల మధ్య ఉన్న ఈ కల్లు దుకాణాన్ని తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అక్కడికక్కడే మృతి