భాగ్యనగరంలో భారీస్థాయిలో అక్రమ విదేశీ బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు(gold seized) పట్టుకున్నారు. విమానాశ్రయ క్యాటరింగ్ ఉద్యోగి వద్ద నుంచి కోటి 9 లక్షలు విలువ చేసే 2.2 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు(2.2 kgs of gold) చేసుకున్నారు.
పట్టుబడిన క్యాటరింగ్ ఉద్యోగి
ఎయిర్‌పోర్టులో క్యాటరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి(gold seized at airport) వద్ద బంగారాన్ని గుర్తించారు. అతను విమానాల్లో ఆహారం అందించే విధులు నిర్వర్తిస్తున్నారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బంగారం ధరలు తక్కువగా ఉండే మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుంచి స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు గుర్తించినట్లు పేర్కొన్నారు.
స్పష్టమైన సమాచారం ఆధారంగా...
డీఆర్‌ఐ అధికారులకు అందిన సమాచారంతో ఈ నెల 27వ తేదీన సాయంత్రం విమానంలో క్యాటరింగ్ చేసే ఉద్యోగస్తున్ని(airport catering employee) హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని దగ్గర నుంచి రెండు కిలో బరువు కలిగిన రెండు బార్లు, మరో రెండు వందేసి గ్రాములు బరువు కలిగిన బంగారు షీట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆహార పదార్థాలను విమానంలోకి పంపడం, విమానం నుంచి తీసుకోవడంలో భాగంగా ఈ బంగారాన్ని స్మగ్లింగ్(gold smuggling) చేసినట్లు గుర్తించామని తెలిపారు. బంగారు స్మగ్లింగ్ చేసిన వ్యక్తిని నిన్ననే రిమాండ్‌కు తరలించినట్లు డీఆర్‌ఐ అధికారులు వివరించారు. విమానాశ్రయంలో పెద్దఎత్తున బంగారం పట్టుబడుతున్నా కూడా అక్రమ రవాణా ఏ మాత్రం ఆగడం లేదు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లోనూ పలుసార్లు బంగారం తరలిస్తూ పట్టబడుతున్న ఘటనలు చాలానే ఉన్నాయి.