DRI Officials Seized 25kg of Drugs in Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి మాదకద్రవ్యాల కలకలం రేగింది. 50 కోట్ల విలువైన 25 కిలోల మత్తుపదార్ధాలను రెవెన్యూ ఆఫ్ ఇంటెలిజెన్స్- డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మెఫిడ్రిన్ తయారుచేసే 2 ల్యాబ్‌లు సీజ్‌చేయడం సహా ఏడుగురు అరెస్టు చేసినట్లు వివరించింది. మత్తుపదార్ధాల తయారీకీ వాడే ముడిసరకు, యంత్రాలు, అక్రమ రవాణాకు వాడే వాహనాలు స్వాధీనంచేసున్నట్లు పేర్కొంది.
ఈమేరకు ఈ నెల 21న హైదరాబాద్‌లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపిన డీఆర్ఐ.. ప్రధాన సూత్రధారిని గోరఖ్‌పూర్‌లో పట్టుకున్నట్లు వివరించింది. 60 లక్షలతో నేపాల్ పారిపోతుండగా పట్టుకున్నట్లు పేర్కొంది. అరెస్టు చేసిన ఏడుగురిలో కొందరిపై, గతంలో మత్తుపదార్ధాల తయారీ కేసులున్నట్లు తెలిపింది. అందులో కొందరిపై హైదరాబాద్‌లో హత్య కేసు, వడోదరలో దోపిడీ కేసు ఉందని డీఆర్ఐ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: