ETV Bharat / crime

Car burnt: దగ్ధమైన కారులో వైద్యుడు.. ప్రమాదమేనా?.. కుట్రా? - doctor burnt alive in car accident in nanakramguda

హైదరాబాద్ నానక్​రామ్​గూడ కూడలి వద్ద ఔటర్​ రింగు రోడ్డుపై శనివారం రాత్రి కారు దగ్ధమై(doctor burnt alive in car)న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఏపీకి చెందిన డాక్టర్ సుధీర్​గా పోలీసులు గుర్తించారు. సుధీర్​ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు.. అతనికి జరిగింది ప్రమాదమా లేక హత్యా, ఆత్మహత్య కోణం ఏమైనా ఉందా అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.

దగ్ధమైన కారులో వైద్యుడు.. ప్రమాదమేనా?.. కుట్రా?

author img

By

Published : Sep 20, 2021, 9:44 AM IST

హైదరాబాద్​ నానక్​రామ్​గూడ కూడలి వద్ద ఔటర్‌ రింగు రోడ్డుపై శనివారం రాత్రి కారు దగ్ధమై(doctor burnt alive in car)న ఘటనలో మృతి చెందిన వ్యక్తిని డా.నేలపాటి సుధీర్‌(39)గా గుర్తించారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పొన్నలూరు మండల కేంద్రంలోని శివాజీనగర్‌. కొన్నేళ్లుగా కేపీహెచ్‌బీ పరిధిలోని సర్దార్‌ పటేల్‌ నగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య సుప్రజ, తొమ్మిది సంవత్సరాల కుమారుడు ఉన్నారు.

నేలపాటి సుధీర్‌

డాక్టర్ సుధీర్.. నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్‌ వైద్యుడిగా సేవలందించేవారు. కొంత కాలం నుంచి ఆయన వైద్య వృత్తిని వదిలి మైనింగ్‌ వ్యాపారం చేస్తున్నారు. శనివారం ఆయన బయటకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి కారులో ఒంటరిగా బయలుదేరారు. నానక్‌రామ్‌గూడ కూడలి వద్ద బాహ్యవలయ రహదారిపైకి ఎక్కారు. శంషాబాద్‌, హమీదుల్లానగర్‌ 135 కి.మీ వద్దకు రాగానే కారులో మంటలు(doctor burnt alive in car) చెలరేగాయి. ఈ ఘటనలో ఆ వైద్యుడు సజీవ దహనమయ్యారు(doctor burnt alive in car). షార్ట్‌సర్యూట్‌ కారణంగానే కారులో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.

20 కి.మీ దూరం..గంట ప్రయాణం

బాహ్యవలయ రహదారిపై గంటకు వంద కి.మీ వేగంతో ప్రయాణించడానికి అనుమతి ఉంది. సుధీర్‌ నానక్‌రామ్‌గూడ కూడలి వద్ద సాయంత్రం 7.09 గంటలకు ఔటర్‌పైకి ప్రవేశించినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. నానక్‌రామ్‌గూడ నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న హమీదుల్లానగర్‌కు 20 నిమిషాల లోపే చేరుకోవచ్ఛు కానీ సుధీర్‌ గంట ప్రయాణం చేసిన తర్వాత రాత్రి 8.10 గంటలకు హమీదుల్లానగర్‌ వద్ద కారు మంటల్లో(doctor burnt alive in car) చిక్కుకుంది. ఔటర్‌పై ఎక్కడైనా ఆగాడా..లేక కారు ఇంజిన్‌ మొరాయించిందా.. ఏదైనా కుట్ర, ఆత్మహత్య కోణం ఉందా అన్ని విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైద్యుడు ప్రమాదంలో మృతిచెందడంతో పొన్నలూరు మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి : fire accident: ట్రాన్స్​ఫార్మర్​ మరమ్మతు కేంద్రంలో అగ్నిప్రమాదం.. రూ.50 కోట్ల మేర ఆస్తి నష్టం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.