ETV Bharat / crime

'అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్టు.. కొరియర్ ద్వారా విదేశాలకు సరఫరా' - An international drug gang

drug gang in Rachakonda: చెన్నె నుంచి హైదరాబాద్‌ మీదుగా విదేశాలకు మాదకద్రవ్యాలు తరలిస్తున్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. విమానాశ్రయంలో తనిఖీల్లో స్కానింగ్‌ ప్రక్రియను ఆసరాగా చేసుకుని.. ఈ ముడిసరుకును ఎగుమతి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐదుగురు సభ్యులు గల ముఠా ఇద్దరిని పట్టుకున్న పోలీసులు.. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

CP Mahesh Bhagwat
CP Mahesh Bhagwat
author img

By

Published : Dec 12, 2022, 5:04 PM IST

Updated : Dec 12, 2022, 6:54 PM IST

'అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్టు.. కొరియర్ ద్వారా విదేశాలకు సరఫరా'

drug gang in Rachakonda: అక్రమార్కుల ఆట కట్టించేందుకు పోలీసులు ఎన్ని కట్టడి చర్యలు చేపట్టినా.. అడ్డదారులకు అలవాటు పడిన కేటుగాళ్లు మాత్రం అంతకుమించిన దొంగతెలివి ప్రదర్శిస్తున్నారు. మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వం, పోలీస్‌ యంత్రాంగం పటిష్ఠచర్యలు చేపడుతున్నా.. తమదైన తెలివితేటలతో సరకు రవాణా చేస్తున్నారు. ఇదే తరహాలో హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఓ డ్రగ్స్‌ ముఠా ఎత్తులను రాచకొండ పోలీసులు చిత్తుచేశారు.

చెన్నెకు చెందిన మహమ్మద్ ఖాసీం, రసూలుద్దీన్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి.. మాదకద్రవ్యాలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతంలో మధురై, చెన్నై ప్రాంతాలను డ్రగ్స్‌ను తరలించిన ఈ ముఠా.. చెన్నైలో డీఆర్​ఐ అధికారుల పటిష్ఠ చర్యలతో కొత్తమార్గాలను ఎంచుకున్నారు. హైదరాబాద్‌, పుణెకు బస్సుల్లో వెళ్లి.. అక్కడి నుంచి విమానాశ్రయాలకు తరలించి.. అక్కడి నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు ఎగుమతి చేస్తున్నారు.

విమానాశ్రయాల్లో తనిఖీ కేంద్రం వద్ద పొడి పదార్థాలు గుర్తించే అవకాశం లేకపోవటంతో.. దీనిని ఆసరాగా చేసుకుని, రామ్‌రాజ్‌ వస్త్రాల పెట్టెల్లో డ్రగ్స్‌ను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే ఖాసీం, రసూలుద్దీన్‌ చెన్నె నుంచి బస్సులో వచ్చి హైదరాబాద్‌ నాచారంలో ఉన్నట్లు వచ్చిన సమాచారంతో పట్టుకున్నట్లు చెప్పారు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో సూడో ఎఫిడ్రీన్‌ డ్రగ్స్‌కు డిమాండ్‌ బాగా ఉంటుందని.. దీనికి కావాల్సిన ముడి సరకును ఈ ముఠా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈ సారి డ్రగ్స్‌ పంపేందుకు ప్రణాళిక రచించారని.. ముఠాలో మహమ్మద్ ఖాసీం, రసూలుద్దీన్‌ పట్టుబడగా, మిగతా ముగ్గురు పరారీలో ఉన్నట్లు సీపీ చెప్పారు.

ఇప్పటి వరకు ఈ ముఠా హైదరాబాద్‌ నుంచి 8సార్లు, పుణె నుంచి 7సార్లు విదేశాలకు మాదకద్రవ్యాలను తరలించినట్లు గుర్తించారు. గతంలో మధురైలో వీరు పోలీసులకు పట్టుబడినట్లు.. ఈ క్రమంలోనే నకిలీ గుర్తింపు కార్డులతో హైదరాబాద్‌ నుంచి దందా సాగిస్తున్నట్లు తేల్చారు.

"అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాను అరెస్టు చేసి ఇద్దరి నుంచి 8 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నాం. డ్రగ్స్‌ విలువ రూ. 9 కోట్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి పుణె మీదుగా కొరియర్ ద్వారా విదేశాలకు సరఫరా చేస్తున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్, పుణె మీదుగా డ్రగ్స్‌ తరలిస్తున్నారు. నిందితులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు డ్రగ్స్‌ను తరలిస్తున్నారు. మహమ్మద్ ఖాసీం, రసూలుద్దీన్‌ను అరెస్ట్ చేశాం. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు."- మహేశ్‌ భగవత్‌, రాచకొండ సీపీ

ఇవీ చదవండి:

Last Updated : Dec 12, 2022, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.