ETV Bharat / crime

Gold Theft Case: 3 కేజీల బంగారు ఆభరణాలతో.. డెలివరీ బాయ్స్ జంప్​! - Delivery boys escape with 3kg gold at ntr district

Gold Theft Case: ఏపీ ఎన్టీఆర్​ జిల్లా కొత్తపేట పోలీస్​ స్టేషన్​ పరిధిలో యజమానిని నమ్మించి 3 కేజీల బంగారం ఆభరణాలతో డెలివరీ బాయ్స్​ఉడాయించారు. జైమాతాది లాజిస్టిక్స్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

బంగారు ఆభరణాలు
బంగారు ఆభరణాలు
author img

By

Published : Jul 9, 2022, 4:59 PM IST

Gold Theft Case: నమ్మించి 3 కేజీల విలువైన బంగారం ఆభరణాలతో ఉడాయించిన ఇద్దరు వ్యక్తులపై ఏపీ విజయవాడలోని కొత్తపేట పోలీసులు నమోదు చేశారు. కొత్తపేట కోమల విలాస్ సెంటరులోని ఎస్ఎస్ టవర్స్​లో రాజస్థాన్​కు చెందిన సునీల్ కుమార్ నివాసముంటున్నారు. ముంబైకి చెందిన జైమాతాది కార్గో ప్రైవేటు లిమిటెడ్ నుంచి ఫ్రాంచైజీ తీసుకొని "జైమాతాది లాజిస్టిక్స్" అనే పేరుతో 5 ఏళ్లుగా కొరియర్ సర్వీసు నిర్వహిస్తున్నారు. ముంబై నుంచి కొరియర్ ద్వారా వచ్చిన బంగారు ఆభరణాలు, డైమండ్స్​ను రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు డెలివరీ చేస్తుంటారు. ఇందుకుగానూ.. సునీల్ కుమార్​కు కమిషన్ వస్తుంది. ఈ డెలివరీ కోసం.. సునీల్​ కుమార్ పలువురు బాయ్స్ ను పనిలో పెట్టుకున్నారు. అతని వద్ద పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు.. బంగారం డెలివరీ చేసేందుకు వెళ్లి.. అట్నుంచి ఉడాయించారు.

ఈనెల 7న ముంబై నుంచి గన్నవరం ఎయిర్​పోర్టుకు వచ్చిన కార్గో విమానం నుంచి ఆభరణాల తాలూకు బాక్సులను యజమాని తీసుకెళ్లాడు. అనంతరం.. ఆ ఆభరణాలను ప్రాంతాల వారీగా డెలివరీ చేసేందుకు విడి విడిగా ప్రత్యేక బాక్సుల్లో ప్యాకింగ్ చేయించారు. అందులో కొన్ని బాక్సులను డెలివరీ బాయ్స్.. రాజీవ్ శర్మ, భవానీసింగ్ అప్పగించి డెలివరీ చేసేందుకు ఈ నెల 8వ తేదీన పంపారు.

ఉదయం వాళ్లను రైలు ఎక్కించిన ఓనర్ సునీల్​ కుమార్​.. మధ్యలో ఫోన్లు చేస్తూ వాకబు చేస్తూ ఉన్నాడు. కొంత సమయం తరువాత డెలివరీ బాయ్స్​ ఫోన్లు స్విచ్ఛాఫ్​​ వచ్చాయి. ఆభరణాలు డెలివరీ తీసుకోవాల్సిన షాపుల వారికి ఫోన్లు చేస్తే రాలేదని సమాధానం వచ్చింది. దీంతో ఆ ఇద్దరు ఆభరణాలతో ఉడాయించినట్లుగా భావించిన యజమాని.. పోలీసులను ఆశ్రయించాడు. సుమారుగా రూ.1.5 కోట్లు విలువైన 3 కేజీల ఆభరణాలతో పారిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నారాయణరెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు

ములాయం సింగ్​ యాదవ్​కు సతీవియోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.