ETV Bharat / crime

మద్యం దుకాణంలో చోరీ.. నిందితుడి అరెస్టు - నాగర్​కర్నూల్​ జిల్లా తాజా వార్తలు

మద్యం దుకాణంలో చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Defendant arrested in liquor store theft case in nagarkurnool district
మద్యం దుకాణంలో చోరీ కేసులో నిందితుడి అరెస్టు
author img

By

Published : Jan 30, 2021, 7:47 PM IST

నాగర్ కర్నూల్​ జిల్లా పెద్దకొత్తపల్లిలోని మద్యం షాపులో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని కొల్లాపూర్​ పోలీసులు అరెస్టు చేశారు. దుకాణం షట్టర్లు పగులగొట్టి క్యాష్ కౌంటర్​లో రూ. 10లక్షలను ఫుల్జాల మల్లయ్య అలియాస్ చిన్న ఎల్లయ్య (50) చోరీ చేసినట్లు వెల్లడించారు. ఆయన నుంచి రూ.7 లక్షలు నగదు, 4 స్మార్ట్ ఫోన్లు, స్వైపింగ్ మిషన్, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

రూ. 2లక్షలకు పైగా జల్సాలకు ఖర్చు చేసినట్లు చెప్పారు. చిన్న మల్లయ్య దాదాపు 100కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 2న జైలు నుంచి విడుదలయ్యాడని... అప్పటి నుంచి నాలుగు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: కేటీఆర్​కు వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీకాంత్ కృతజ్ఞతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.