మహబూబ్నగర్ కలెక్టరేట్ ఆవరణలోని ఓ మురుగు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రెవెన్యూ సమావేశ మందిరానికి సమీపంలోని కాలువ నుంచి దుర్వాసన వస్తుండడంతో.. స్థానికులు పరిశీలించారు. మృతదేహం ఉన్నట్లు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి సుమారు 50 సంవత్సరాల వయస్సు ఉండవచ్చునని వారు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: ఏడుగురుని పొట్టన పెట్టుకున్న ముగ్గురి నిర్లక్ష్యం