మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాగారం పురపాలక పరిధిలో నివసించే దొబ్బాల సత్తయ్య(65) అనే వ్యక్తి గతేడాది కురిసిన భారీ వర్షాలకు వాగులో గల్లంతయ్యాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసేందుకు ఎంత గాలించినా లభించలేదు.
తాజాగా నాగారం పురపాలిక పరిధిలోని వాగులో ముళ్లపొదల్లో చిక్కుకొని ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకుని శవాన్ని వెలికితీశారు. మృతుడు దొబ్బాల సత్తయ్యగా గుర్తించారు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.