Dead Bodies Found in Gaddenna Vagu: నిర్మల్ జిల్లాలోని భైంసాలోని గడ్డెన్న వాగులో మృతదేహాల కలకలం సృష్టించాయి. ఉదయపు నడకకు వెళ్లిన వాకర్స్‌కు గడ్డెన్న వాగులో మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.
వాగులోని మృతదేహాలు యువతి, యువకుడుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలు వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు. యువకుడు భైంసాలోని రాహుల్‌నగర్‌కు చెందిన గోపాల్(24)గా గుర్తించారు. అతనికి ఇప్పటికే పెళ్లి అయినట్లు పేర్కొన్నారు. యువతి ఏపీ నగర్‌కు చెందిన సునితగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: Palvancha Family suicide : రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో విడుదల