kandada accident: రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం కందాడ వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గుల్బర్గా నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్.. ఎదురుగా వస్తోన్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వ్యాన్లో ఉన్న వారంతా హైదరాబాద్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి..
ముందు రోడ్డు ప్రమాదం.. వెనక ట్రాఫిక్ జాం.. 2 లారీల మధ్యలో ఇరుక్కుపోయిన బొలేరో..