ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా.. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలో విషాదం నెలకొంది. మాధవి అనే మహిళ తన కుమారుడు లోహిత్, కుమార్తె హరిణిలకు విషమిచ్చి, ఆమె కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
గమనించిన స్థానికులు... బాధితులను అమలాపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కుమార్తె హరిణి మృతి చెందింది. తల్లి మాధవి, కుమారుడు లోహిత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మాధవి భర్త సతీశ్ వేధింపులు తట్టుకోలేక మాధవి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.