ETV Bharat / crime

Viral Video: బర్త్​డే వేడుకల్లో అశ్లీల నృత్యాలు.. వీడియోలు వైరల్ - dance with women in old city

Recording Dance at Birthday Celebrations: పుట్టినరోజు వేడుకలంటే సన్నిహితులను, బంధువులను ఆహ్వానించి కేక్ కట్ చేసి.. ఆ తర్వాత డీజే పెట్టుకుని.. కాసేపు సరదాగా అందరూ కలిసి ఆడిపాడేవాళ్లు. కానీ ఇప్పుడు అలాంటి సంస్కృతికి స్వస్తి పలుకుతున్నారు. హద్దులు దాటి ప్రవర్తిస్తూ పలు వేడుకలను అశ్లీల నృత్యాలకు వేదికలుగా మారుస్తున్నారు. ఇది వరకు నాలుగు గోడల మధ్య.. అంటే ఏ పబ్బుల్లోనో, డిస్కోల్లోనే జరిగేవి. కానీ ఇప్పుడు ఆ సరదాలను ఇంటికే తెచ్చారు. రాత్రి వేళల్లో డ్యాన్సర్లతో చిందులు వేస్తూ తమను తాము మరిచిపోయారు. ఆ వేడుకలకు పాతబస్తీ వేదికైంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Recording Dance at Birthday Celebrations
పుట్టిన రోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలు
author img

By

Published : Jun 8, 2022, 1:36 PM IST

పుట్టిన రోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలు

Recording Dance at Birthday Celebrations: హైదరాబాద్ పాతబస్తీలోని రెయిన్ బజార్​లో ఇటీవల జరిగిన పుట్టిన రోజు వేడుకలు చర్చనీయాంశంగా మారాయి. బర్త్​డే వేడుకల పేరిట ఓ ఇంట్లో జరిగిన సంబరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో అతిథులను సంతోషపెట్టడానికి పలువురు యువతులకు డబ్బులిచ్చి నృత్యాలు చేయించారు. పార్టీకి వచ్చిన వారు సైతం.. ఆ యువతులతో కలిసి చిందులేశారు. ఆ దృశ్యాలన్నిటినీ చరవాణుల్లో బంధించారు.

కాగా ఈ దృశ్యాలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు ఈ పార్టీ ఎప్పుడు జరిగింది.? ఎవరు ఏర్పాటు చేశారు.? ఏ సమయం వరకు జరిగాయనే తదితర విషయాలు తెలియాల్సి ఉంది. జనావాసాల్లో ఇంత జరుగుతున్నా ఇప్పటివరకూ పోలీసులకు ఫిర్యాదు అందకపోవడం గమనార్హం.

ఇవీ చదవండి:

జూబ్లీహిల్స్​ సామూహిక అత్యాచారం.. ఏ-1కు 3రోజుల కస్టడీ

లైంగిక వాంఛ తీర్చుకుని పెళ్లికి 'నో' చెప్పాడు..

మరో 'నిర్భయ' ఘటన.. బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.