వాట్సాప్ వీడియోకాల్ చేసి నగ్న చిత్రాలు పంపించి.. నీ నగ్న చిత్రం పంపమని.. ఆపై బ్లాక్ మెయిల్ చేసి డబ్బు స్వాహా చేసిన ఘటనలు ఇటీవల మైలార్‌దేవుపల్లి పరిసరాల్లో చోటుచేసుకున్నాయి.
నువ్వంటే పిచ్చి ప్రేమ అంటూ ట్రాప్
మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్ నరసింహ కథనం ప్రకారం... వారం రోజుల క్రితం లక్ష్మీగూడలో ఉండే ఇంటర్ విద్యార్థి(20) సెల్‌ఫోన్‌కు ఓ యువతి (యువకుడే ప్రత్యేక యాప్ సాయంతో అలా చేశాడు) నుంచి కాల్ వచ్చింది. నీ అందం చూసి పడిపోయానంటూ మూడు గంటల పాటు మాట్లాడాడు. మరుసటి రోజు వీడియో కాల్ వచ్చింది. ఓ యువతి తల కనిపించకుండా నగ్నంగా కనిపించింది. నువ్వంటే నాకు పిచ్చిప్రేమ... అందుకే ఇలా కనిపిస్తున్నానంటూ ఏమార్చాడు. ఆపై నాకు నీ నగ్న చిత్రం లేదా వీడియో పంపించాలని కోరింది. ఆ మాటలకు మోసపోయిన విద్యార్థి నగ్నంగా తయారై వీడియోకాల్‌లో కనిపించాడు.
ఇంటికొచ్చి నిలదీస్తామని బెదిరింపులు
ఆపై ఓ వ్యక్తి వీడియో కాల్‌లో ప్రత్యక్షమై బ్లాక్‌మెయిల్ చేశాడు. మా ఇంటి ఆడపిల్లకు నగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు పంపిస్తావా...మీ ఇంటికి వచ్చి మీ వాళ్లను నిలదీస్తానని హెచ్చరించాడు. వద్దని వేడుకున్న యువకుడు ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు. దీంతో యువకుడి వద్దనుంచి రూ.20వేలు రాబట్టుకున్నాడు. పెద్దవాళ్లకు విషయం తెలిసి మైలార్‌దేవుపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇదేతీరులో శాస్త్రిపురానికి చెందిన మరో విద్యార్థి(యువకుడు) కూడా మోసపోయాడు. ఇద్దరి ఫిర్యాదులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఇదీ చూడండి:
CYBER CRIME: ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్.. రూ.40 లక్షలు స్వాహా