Cyberabad Police Raids on Farmhouses: ఓ వైపు గంజాయి, మత్తుపదార్ధాలపై హైదరాబాద్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫామ్‌హౌజ్ ముసుగులో కొందరు అసాంఘీక చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఇలాంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టిన సైబరాబాద్ పోలీసులు.. వాటి గుట్టును రట్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి నగర శివారు ప్రాంతాల్లోని 32 ఫామ్‌హౌస్‌లపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు సోదాలు చేసిన పోలీసులు.. వీటిలో నాలుగు ఫామ్‌హౌస్‌లలో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. మోయినాబాద్‌లోని బిగ్‌బాస్ ఫామ్‌హౌస్, జహంగీర్ డ్రీమ్ వ్యాలీ,.. శంషాబాద్ పరిధిలోని రిప్లెజ్ ఫామ్‌హౌస్,.. మేడ్చల్‌లోని గోవర్ధన్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లపై కేసులు నమోదు చేశారు.
ఈ సోదాల్లో 22 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మద్యం బాటిళ్లు, హుక్కా సామాగ్రి, ప్లేయింగ్ కార్డ్స్.. రూ.1,03,000 నగదు, 7చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ఫామ్‌హౌస్‌లో తనిఖీలు తరుచుగా జరుగుతున్నా.. కొన్నింటిలో అసాంఘీక కార్యక్రమాలు జరుపుతున్నట్లు సమాచారం రావడంతో ఈ సోదాలు నిర్వహించామని తెలిపారు. అసాంఘీక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫామ్‌హౌస్ నిర్వాహకులను పోలీసులు హెచ్చరించారు.
ఇవీ చదవండి: భద్రాద్రి కొత్తగూడెంలో 488 కేజీల గంజాయి పట్టివేత.. విలువ ఎంతంటే?
మందుబాబులకు వింత శిక్ష.. స్టేషన్లో కూర్చోబెట్టి 1000సార్లు ఇంపోజిషన్.. ఏం రాయించారంటే..
అనేక రోజులుగా ఇంట్లోనే తల్లి మృతదేహం.. బతికుందని అందరినీ నమ్మిస్తూ..