గొలుసుకట్టు మార్కెటింగ్ మోసాలకు పాల్పడిన ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ పేరుతో 24 మంది సభ్యుల ముఠా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. 1,500కోట్ల మేర వసూలు చేసినట్లు గుర్తించిన పోలీసులు... ఇండస్ వివాకు చెందిన బ్యాంకు ఖాతాల్లోని 20 కోట్ల నగదు సీజ్ చేశారు.
ఇండస్ వివా కంపెనీ కేసులో థామస్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు... అరెస్టు అయినవారిలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలిపారు. గొలుసుకట్టు మార్కెటింగ్‌లో కొత్తవారిని చేర్పిస్తే ఆదాయం వస్తుందని మోసాలకు పాల్పడ్డారని వెల్లడించారు.
- ఇదీ చూడండి : నన్ను విమర్శిస్తే ఊరుకోను.. బాలకృష్ణ హెచ్చరికలు