ETV Bharat / crime

రైల్వేలో ఉద్యోగాలని చెప్పి.. అక్కడికెళ్తే అసలు మోసం.. - hyderabad crime news

రైల్వేలో ఉద్యోగాలు పేరిట మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. లక్షలు తీసుకొని ఐడీ కార్డు, కొన్ని నకిలీ పత్రాలను అందజేసి ఉడాయించిన బృందం గుట్టురట్టుచేశారు. ఈ ముఠా నాలుగైదేళ్లుగా వందలాది మంది నిరుద్యోగులను మోసం చేసిందని, రైల్వే ఉద్యోగుల ప్రమేయంపైనా దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.

telangana crime news
రైల్వేలో ఉద్యోగాలని చెప్పి.. అక్కడికెళ్తే అసలు మోసం..
author img

By

Published : Mar 5, 2021, 7:36 AM IST

రైల్వేలో ఉద్యోగం పేరిట ఏకంగా శిక్షణ ఇచ్చి, ఐడీ కార్డు, నకిలీ పోస్టింగ్‌ ఉత్తర్వులతో వందలాది మంది నిరుద్యోగులకు టోపీ పెట్టిన ముఠా గుట్టును సైబరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. బాధితుల్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు.

టీసీ, ట్రాక్‌మెన్‌ ఉద్యోగాలంటూ..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సర్వేష్‌ సాహూ అలియాస్‌ అశోక్‌కుమార్‌ సింగ్‌ ఎంబీఏ చదివాడు. విజయవాడ సనత్‌నగర్‌కు చెందిన అబ్దుల్‌ మాజిద్‌ అలియాస్‌ శ్రీనివాస్‌ (26), మిశ్ర (దిల్లీ), దినేష్‌ (కోల్‌కతా)తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ఫేస్‌బుక్‌, వాట్సప్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా రైల్వేలో టీసీ, ట్రాక్‌మెన్‌ తదితర ఉద్యోగాలిప్పిస్తామంటూ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆసక్తి చూపిన వారికి వాట్సప్‌లో లింక్‌ పంపించాడు. అందులో వివరాలు నమోదు చేసుకున్నవారు దిల్లీలో వైద్య పరీక్షల నిమిత్తం ముందుగా రూ.50 వేలు చెల్లించాలని షరతు విధించాడు.

వైద్యపరీక్షలు... ఆఫర్‌ లెటర్లు

దిల్లీకి చేరుకున్న బాధితులకు సర్వేష్‌ సాహూ కలుసుకుని రైల్వే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాడు. వాటిలో ‘ఫిట్‌’ అని తేలిందని సమాచారమిచ్చాడు. దిల్లీలో పనిచేయాలనుకుంటే పహాడ్‌గంజ్‌ (దిల్లీ) డీఆర్‌ఎం కార్యాలయంలో మిశ్రను, దక్షిణ భారతదేశంలోనైతే ఖరగ్‌పూర్‌ డీఆర్‌ఎం కార్యాలయంలో దినేష్‌ను కలవాలని చెప్పాడు. వారికి ఆఫర్‌ లెటర్‌ పంపించాడు. మరో రూ.2 లక్షలు చెల్లిస్తే శిక్షణకు పంపిస్తానంటూ నమ్మబలికాడు. రూ.2 లక్షలు చెల్లించిన అభ్యర్థులను పలు బ్యాచ్‌లుగా విభజించాడు. పశ్చిమ బెంగాల్‌, దిల్లీల్లో ‘రైల్వే ప్రాంతీయ శిక్షణ కేంద్రం’ పేరిట మూడు నెలలపాటు శిక్షణ ఇప్పించాడు.

అక్కడికెళ్తే అసలు మోసం..

కొన్ని రోజుల తర్వాత రూ.3 లక్షలు తీసుకుని దిల్లీకి రావాలని సూచించాడు. అక్కడికి చేరుకోగానే ఐడీ కార్డు, కొన్ని నకిలీ పత్రాలను అందజేసి రెండు రోజుల తర్వాత దిల్లీలోని రైల్వే ప్రధాన కార్యాలయంలో సంప్రదించమని చెప్పాడు. తీరా అక్కడికెళ్తే అసలు మోసం బయటపడింది. ఈ తరహాలోనే రూ.6.3 లక్షలు మోసపోయానంటూ ఓ నిరుద్యోగి రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శంషాబాద్‌ ఎస్వోటీ పోలీసులు దిల్లీ, కోల్‌కతా, విజయవాడల్లో గాలించి సర్వేష్‌ సాహూ, అబ్దుల్‌ మాజీద్‌లను అరెస్ట్‌ చేశారు. మిశ్ర, దినేష్‌ పరారీలో ఉన్నారని సీపీ వివరించారు. ఈ ముఠా నాలుగైదేళ్లుగా వందలాది మంది నిరుద్యోగులను మోసం చేసిందని, రైల్వే ఉద్యోగుల ప్రమేయంపైనా దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.

ఇవీచూడండి: రాష్ట్రంలోకి 'బ్యాండ్‌ బాజా బరాత్‌' ముఠా.. పోలీసులు అలర్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.