ETV Bharat / crime

Cyberabad Cp on Nepal Couples: 'నాలుగు బృందాలుగా ఏర్పడి నేపాల్ దంపతులను అరెస్ట్ చేశాం'

రాయదుర్గం పీఎస్ పరిధిలో సినీ ఫక్కీలో జరిగిన ఆరు రోజుల క్రితం జరిగిన చోరీ (Nepali Theft) కేసులో నేపాల్​కు చెందిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంచలనం సృష్టించిన ఈకేసులో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి వీరిని పట్టుకున్నారు.

Cyberabad cp
రాయదుర్గం పీఎస్
author img

By

Published : Sep 25, 2021, 9:04 PM IST

రాయదుర్గం పీఎస్ పరిధిలో ఆరు రోజుల కిందట జరిగిన చోరీ కేసులో నేపాల్​కు చెందిన దంపతులను (Nepal Couples) అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర (Cyberabad Cp Stephen Ravindra)తెలిపారు. టెలికాంనగర్​లో నివాసం ఉండే గోవిందరావు... ఐదు నెలల క్రితం నేపాల్​కు చెందిన దంపతులను పనిలో పెట్టుకున్నాడని తెలిపారు. ఈనెల 18న అతను కుటుంబంతో కలిసి శ్రీశైలం వెళ్లినప్పుడు... నేపాల్ దంపతులు చోరీకి పాల్పడినట్లు సీపీ స్టీఫెన్ తెలిపారు.

నేపాల్​లోని కలికోట్ జిల్లాకు చెందిన బహదూర్ షాహి, పవిత్ర దంపతులు 110 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు దోచుకెళ్లినట్లు ఇంటి యజమాని గోవిందరావు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలించారు. నేపాల్ పారిపోవచ్చనే ఉద్దేశంతో సరిహద్దులోనూ నిఘా పెట్టారు. సాంకేతికత ఆధారంగా నిందితులిద్దరూ షోలాపూర్​లో ఉన్నట్లు నిర్ధరించుకొని ఓ పోలీస్ బృందం అక్కడికి వెళ్లింది. రైల్వే స్టేషన్​లో ఉన్న నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి 110 తులాల బంగారం, రూ.7.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

'నాలుగు బృందాలుగా ఏర్పడి నేపాల్ దంపతులను అరెస్ట్ చేశాం'

'నిందితులు నేపాల్​కు చెందినవారు. వీళ్ల వెంటనే ట్రాక్​ చేయకపోతే తప్పించుకునే అవకాశం ఉందని నాలుగు బృందాలను ఏర్పాటు చేశాం. ఈ టీమ్స్​ను షోలాపూర్, ముంబయి, లఖ్​నవూ, సిమ్లా పంపించాం. పక్కా సమాచారంతో నేపాల్​కు చెందిన లక్ష్మణ్, అతని భార్య పవిత్రను షోలాపూర్​ రైల్వేస్టేషన్​ దగ్గర అరెస్ట్ చేశాం.'

-- స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ

ఇదీ చూడండి: NEPAL GANG: మరోసారి నేపాల్​ గ్యాంగ్​ హల్​చల్​.. పాత స్కెచ్​తో కొత్తగా దోచేశారు

సినిమా కథను మించిన థ్రిల్లర్ స్టోరీ​... నేపాల్​ గ్యాంగ్​ చోరీల మిస్టరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.