ETV Bharat / crime

Cyberabad CP: 'బ్యాంకు అధికారులమని.. రూ.3కోట్లు దోచేశారు''

బ్యాంక్ అధికారులమంటూ ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్న దిల్లీలోని కాల్ సెంటర్​పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేశారు. దిల్లీలోని కాల్‌ సెంటర్‌పై దాడి చేసి 16 మందిని అరెస్టు చేశారు. అక్కడి పోలీసుల సాయంతో నిందితులును అదుపులోకి తీసుకున్నారు.

Cyberabad CP
సైబర్ క్రైమ్
author img

By

Published : Nov 17, 2021, 12:57 PM IST

కప్పుడు దొంగలు ఇళ్లకు కన్నాలేసి.. బీరువాలు పగలగొట్టి, అయినకాడికి ఎత్తుకెళ్లేవారు. ఇప్పుడు ఉన్నచోటి నుంచే ఆన్‌లైన్‌ ద్వారా సొత్తు దోచేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు (Cybercriminals). మనతోనే తాళాలు (పాస్‌వర్డ్‌లు) ఇప్పించుకుని, మనం కళ్లు తెరిచి చూసేలోగా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఫోన్‌ చేసి నాలుగు మాయమాటలు చెప్పి, డెబిట్‌కార్డుకు ఉండే నాలుగంకెల పిన్‌ నెంబరు తెలుసుకుని.. గుల్ల చేస్తున్నారు.

ఇదే విధంగా బ్యాంక్​ అధికారులమని.. అమాయకులకు ఫోన్​లు చేసి.. వారి ఖాతాల నుంచి డబ్బును తస్కరిస్తున్న ముఠాను సైబర్​బాద్​ సైబర్​ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశారు. దిల్లీ, ఉజ్జయినిలోని వారి స్థావరాలపై దాడులు చేశారు. అక్కడి పోలీసుల సహాయంతో కాల్​సెంటర్​లోని మొత్తం 23 మందిలో 16 మందిని అరెస్ట్ చేశారు.

నిందితులు బ్యాంక్‌ అధికారులమంటూ పలువురి ఖాతాల నుంచి.. విడతల వారీగా రూ.3 కోట్లు కాజేసినట్లు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో దిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం కాల్‌ సెంటర్‌పై దాడి చేసింది. 16 మంది పట్టుకోగా మరో ఏడుగురు పరారయ్యారు. 16 మందిలో 9 మందిని దిల్లీలో.. 7గురిని ఉజ్జయినిలో పట్టుకున్నట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నిందితుల (Cybercriminals) నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

సులువుగా చిక్కేది వాళ్లే..

బ్యాంకు వినియోగదార్లలో చాలా వరకు చదువుకున్నవారు ఉండొచ్చు. కానీ ఎన్‌బీఎఫ్‌సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ) ఖాతాదార్లలో ఎక్కువమందికి తగిన అవగాహన ఉండదు. కొందరు నిరక్షరాస్యులూ ఉంటారు. ఇటువంటి వారు మోసగాళ్ల (Cybercriminals) గాలానికి సులువుగా చిక్కుతున్నారు. అలానే ఈ ముఠా రూ.3కోట్లు కొల్లగొట్టింది.

గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ లేదా సోషల్‌ మీడియా పోస్ట్‌ మనకు వస్తుంది. ఫలానా బ్యాంకు/ బీమా కంపెనీ/ ప్రభుత్వ సంస్థ నుంచి మాట్లాడుతున్నామని చెప్పుకుంటారు. మనకు నమ్మకం కలిగించడం కోసం మన పూర్తి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు చెబుతారు. బ్యాంకు ఖాతా/ కార్డు వివరాలను అప్‌డేట్‌ చేయాల్సి ఉందంటూ, తమకు కావలసిన వివరాలు అడుగుతారు. మొబైల్‌కు ఓటీపీ వస్తుంది, చూసి చెప్పండి.. అంటారు. అది చెప్పామా, మన బ్యాంకు ఖాతా ఖాళీ అయినట్లే. ఇటువంటి ఫోన్‌ కాల్స్‌, వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.

''బ్యాంకులు కానీ, ఇతర సంస్థలు కానీ మనకు ఫోన్‌ చేసి యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌, కార్డు వివరాలు, సీవీవీ నెంబరు, ఓటీపీ అడగవని గుర్తించాలి.''

ఇవీ చూడండి: RBI on Cyber Crime: 'డిజిటల్‌' దొంగలొస్తున్నారు.. బీ అలర్ట్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.