ETV Bharat / crime

మంత్రి పేరు మీద ఫోన్ వచ్చిందా..!! తస్మాత్ జాగ్రత్త.. డబ్బులు పోవడం ఖాయం - Telangana Crime News

Fake number on Minister name: వ్యవసాయ శాఖ మంత్రి పేరు మీద మీకు ఫోన్​ వచ్చిందా.. 9353849489 నెంబర్​తో వాట్సప్ మెసేజ్ వచ్చిందా..!! అయితే జాగ్రత్త.. నిన్న మొన్నటి వరకూ అపరిచిత నెంబర్లతో ఫోన్ చేసి సైబర్ క్రైంకు పాల్పడిన ఓ దందా మరో ముందడుగు వేసి ఏకంగా వ్యవసాయ మంత్రి పేరు మీదనే దందా ఏంచక్కా కొనసాగిస్తున్నారు. దీనిపై ఆ శాఖ మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Cyber criminals
Cyber criminals
author img

By

Published : Dec 7, 2022, 7:20 PM IST

Fake number on Minister name: సైబర్ నేరగాళ్ల దందా రోజురోజుకూ మితిమీరిపోతుంది. నిన్న మొన్నటి వరకూ అపరిచిత నెంబర్లు నుంచి కాల్ చేసి డబ్బులు వసూళ్లు చేసిన ఈ నేరగాళ్లు మరో ముందడుగు వేసి ఏకంగా వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్​రెడ్డి పేరుతో దందాకు పాల్పడుతున్నారు. వాట్సప్ కేంద్రంగా పని చేస్తున్న ఈ ముఠాపై స్వయంగా మంత్రే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం వ్యవసాయ శాఖ మంత్రి పేరిట కొందరు సైబర్ నేరగాళ్లు.. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు ఫోన్ చేసి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.

ఇప్పటికే మంత్రి పేరుతో కొందరికి మెసేజ్​లు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. 9353849489 అనే నంబర్ నుంచి కొందరికి సంక్షిప్త సందేశాలు వస్తున్నాయని.. వాటిపై ఎవరు స్పదించవద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎట్టి పరిస్థితుల్లో ఆ నంబరుకు డబ్బులు పంపించవద్దని విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్లపై తాము చట్టపరంగా చర్యలు చేపడతామని మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.