ETV Bharat / crime

'ఉద్యోగం కోసం ఛార్జీలు చెల్లించారా? అయితే.. చింతించకండి.. తిరిగి ఇచ్చేస్తాం'

మీరు గతంలో ఏదైనా రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో రెజ్యూమ్‌ను అప్‌లోడ్‌ చేశారా? రిజిస్ట్రేషన్‌, ఇతర ఛార్జీలు చెల్లించారా? ఉద్యోగం రాలేదా? అయితే.. చింతించకండి. మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాం (రిఫండ్‌) అంటూ కేటుగాళ్లు ‘తెలివి’గా వల విసురుతూ జేబుల్ని ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి కాల్స్​పై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

cyber-criminals
సైబర్ క్రైమ్
author img

By

Published : Oct 18, 2021, 9:34 AM IST

ప్రముఖ ఫార్మా కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్లు వేసిన వలలో చిక్కుకుపోయాడు. ఏకంగా రూ.15.8 లక్షలు పోగొట్టుకున్నాడు. సైబరాబాద్‌ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ నయా మోసం వెలుగు చూసింది. మరో నలుగురైదుగురు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమై ఈ తరహా మోసాలపై కూపీ లాగుతున్నారు.

నాలుగైదు వెబ్‌సైట్ల డేటా...

ఉద్యోగాలకు సంబంధించిన వెబ్‌సైట్లలో నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఛార్జీలన్నీ చెల్లించినా ఎంతకీ స్పందన రాకపోవడంతో ఆ సంగతి మరిచిపోతున్నారు. ఇలాంటి కొన్ని వెబ్‌సైట్లకు సంబంధించిన సమాచారం కేటుగాళ్ల చేతికి చిక్కినట్లు పోలీసులు గుర్తించారు. వెబ్‌సైట్లలో ఉన్న వారికి కేటుగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. సాంకేతిక కారణాలతో మీ సమాచారం పోయిందని నమ్మిస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తాం.. లేదంటే గతంలో చెల్లించిన డబ్బును వడ్డీతో కలిపి రీఫండ్‌ చేస్తామంటూ వల విసురుతున్నారు. support@refundpayumoney.com అనే ఐడీ నుంచి మెయిల్స్‌ పంపిస్తున్నారు. తాజా కేసులో బాధితుడు గతంలో రూ.1.8 లక్షలు చెల్లించాడు. ఇప్పుడు రూ.1.98 లక్షలు రిఫండ్‌ చేస్తామంటూ నమ్మించి నిండా ముంచేశారు.

మీ బ్యాంక్‌ ఖాతాకు ఆన్‌లైన్‌లో డబ్బు జమ చేస్తామంటూ వివరాలు తీసుకుంటున్నారు. తర్వాత కాల్‌ చేసి సర్వర్‌ వెరిఫికేషన్‌ అయిందని, కాకపోతే.. మీ ఖాతాకు రెడ్‌ మార్క్‌ వస్తోందని నమ్మబలుకుతున్నారు. మీకు పంపే డబ్బుకు అయిదింతలు మా ఖాతాలో ఉంటేనే బదిలీ చేసేందుకు అవకాశముంటుందని చెబుతున్నారు. ఆ డబ్బును తిరిగిచ్చేస్తామంటూ చెప్పి, తర్వాత సాంకేతిక కారణాలతో కుదరడం లేదంటారు. ముందుగా రూ.50 వేల నుంచి రూ.లక్ష ముందే చెప్పినట్లు బదిలీ చేస్తామంటున్నారు. మిగిలింది చెక్‌ రూపంలో ఇస్తామంటూ ముఖం చాటేస్తున్నారు.

ఇదీ చూడండి: Cyber crimes Types: ఫెస్టివల్ ఆఫరా.. స్పెషల్ గిఫ్ట్ వచ్చిందా? కాస్త ఆలోచించండి!

ఇంటింటా 'కాల్‌'నాగులు.. సైబర్ నేరాలకు అడ్డాగా ఎడారి రాష్ట్రం

Cyber Crime: వీడియో చూడండి.. ‘డబ్బు పొందండి’

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.