ETV Bharat / crime

ఇన్​స్టాలో చాటింగ్​ చేస్తున్నారా..? అయితే ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే..!! - Instagram cyber crimes

"ట్రెండ్​ మారుతోంది.. దానికి తగ్గట్టు మనమూ మారాలి.." ఇది ప్రస్తుత జనరేషన్​​ తరచూ చెప్పే మాట. దీన్నే సైబర్​ నేరగాళ్లు కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ పంథా మార్చుకుంటూ.. ట్రెండ్​కు తగ్గట్టే మోసాలకు తెరతీస్తున్నారు. వాట్సప్​.. ఫేస్​బుక్​.. ఇలా సోషల్​ మీడియాను ఆధారంగా చేసుకుని దోచేసిన సైబర్​ నేరగాళ్లు.. ఇప్పుడు ఇన్​స్టాగ్రామ్​ను వాడేస్తున్నారు. ఇన్​స్టాలో స్వీట్​గా చాట్​ చేస్తూ.. నైస్​గా ఎలా దోచేస్తున్నారో మీరూ చూసేయండి..!

Cyber criminals choosing Instagram to fraud women in Hyderabad

author img

By

Published : May 22, 2022, 5:08 PM IST

హైదరాబాద్​లోని మారేడ్‌పల్లిలో ఉంటున్న ఓ యువ వైద్యురాలికి కొద్దిరోజుల క్రితం ఇన్​స్టాలో ప్రెండ్​ రిక్వెస్ట్​ వచ్చింది. ఫ్రొఫైల్​ను చూస్తే.. తనకు సంబంధించిన రంగంలో ఉన్న వ్యక్తే అనిపించి రిక్వెస్ట్​ను అక్సెప్ట్​ చేసింది. ఇద్దరి మధ్య పరిచయం కుదిరింది. తాను లండన్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో హార్ట్​ స్పెషలిస్ట్​గా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు చాట్​ చేసుకున్నారు. తన ఆసుపత్రికి సంబంధించిన విషయాలన్నింటినీ ఆమెకు వివరించాడు. తమ మూలాలు భారత్‌లోనే ఉన్నాయని.. ఉత్తరాఖండ్​లోని ఓ నగరం పేరు చెప్పాడు. ఇలా ఇద్దరి మధ్య చాలా సంభాషణ జరిగి.. మంచి మిత్రులయ్యారు. "మీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరం పెళ్లి చేసుకుందాం.. హైదరాబాద్‌లోనే ఆస్పత్రి నిర్మించి గుండెజబ్బులతో బాధపడుతున్న పేదలకు సేవచేద్దాం.." అని తన అభ్యర్థనను ఆమె ముందుంచాడు. అతడి ఉద్దేశం నచ్చి.. యువవైద్యురాలు కూడా పెళ్లికి సరేనంటూ పచ్చజెండా ఊపేసింది.

Cyber criminals choosing Instagram to fraud women in Hyderabad
ఇన్​స్టాలో చాటింగ్​ చేస్తున్నారా..? అయితే ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే..!!

"మన నిశ్చితార్థానికి గుర్తుగా 20 వేల డాలర్ల విలువైన వజ్రపుటుంగరాన్ని పంపుతున్నా.." అని చెప్పాడు. మరుసటి రోజు ఆమెకు ఫోన్‌ చేసి.. "వజ్రపుటుంగరానికి కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించాలి.. రూ.2.45 లక్షలు పంపితే మీ ఇంటికే నేను పంపిస్తోన్న బహుమతి వస్తుంది" అని చెప్పడంతో.. ఇంకేం ఆలోచించకుండా అతడు సూచించిన ఖాతాలో రూ.2.45 లక్షలు జమచేసింది. తన ఫియాన్సీ ప్రేమతో పంపిన బహుమతి ఎప్పుడెప్పుడు వస్తుందా...? అని ఆమె ఎదురుచూస్తోంది. పదిరోజులైనా ఉంగరం రాకపోవడంతో.. అతగాడికి ఫోన్​ చేసింది. అందరూ ఊహించినట్టే.. ఆ నంబర్​ స్విచ్ఛాఫ్​. అప్పుడు ఆ యువవైద్యురాలికి పరిస్థితి అర్థమైంది. మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.

ఇంతకుముందు.. పోలీస్‌ అధికారులు, ఐఏఎస్‌ల ఫోటోలతో ఫేస్‌బుక్‌ ఖాతాలు, వాట్సాప్‌ డీపీలతో.. కార్పొరేట్‌ కంపెనీలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థల ఉద్యోగులను బురిడీ కొట్టిస్తూ రూ.లక్షలు కాజేస్తున్న సైబర్​నేరస్థులు ఇప్పుడు పంథా మార్చారు. కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా యువతులు, వృత్తి నిపుణులను లక్ష్యంగా చేసుకుని స్నేహం.. పెళ్లి.. పేర్లతో గాలం వేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలకు ప్రెండ్​ రిక్వెస్ట్​ పంపించి.. రోజుల వ్యవధిలోనే చిరకాల మిత్రుల్లా మారిపోతున్నారు. తాము విదేశాల్లో ఉంటున్నామని... తమవద్దకు వస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని, పెళ్లి చేసుకుని ఇక్కడే ఉందామంటూ తీయని కబుర్లు చెబుతున్నారు. ఈ మాటలను స్పందించిన వెంటనే తమ మాయాజాలాన్ని ప్రదర్శించి రూ.లక్షలు కాజేస్తున్నారు.

విదేశాల్లో ఉంటున్న వ్యాపారులు, వృత్తి నిపుణుల ఫోటోలను.. అంతర్జాలం నుంచి సేకరిస్తున్నారు. వాటితో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు తెరుస్తున్నారు. అనంతరం హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, విజయవాడ, వైజాగ్‌ నగరాల్లో నివాసముంటున్న పెళ్లికాని యువతులు, వృత్తి నిపుణులతో మాట్లాడుతున్నారు. బాధితులకు ఎక్కడా అనుమానం రాకుండా నిందితులు వారి ల్యాప్‌టాప్‌లలో ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని వాట్సాప్‌ ద్వారా మాట్లాడేప్పుడు బాధితుల చరవాణిలో.. ఏదేశం నుంచి ఫోన్‌చేస్తున్నారో అక్కడి ఐఎస్‌డీ నంబర్‌ కనిపించేలా జాగ్రత్తపడుతున్నారు.

అంతా సెట్​ అయ్యాక.. పెళ్లి చేసుకుందాం అంటూ అసలు అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. ఇక అక్కడి నుంచి మళ్లీ పాత పద్ధతిని ఎలాంటి అనుమానం రాకుండా అమలు చేస్తున్నారు. నిశ్చితార్థం, ఇతర వేడుకల కోసమంటూ వారికి బంగారు, వజ్రాభరణాలు, వేల పౌండ్ల, డాలర్ల విలువైన అభరాణాలు, గడియారాలు పంపుతున్నామంటూ నమ్మిస్తున్నారు. బంగారు, వజ్రాభరణాల ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలకు పంపుతున్నారు. లైవ్‌ వీడియోలంటూ విమానాశ్రయం వీడియోలూ పంపుతున్నారు. వాటిని తీసుకునేందుకు బాధితులు ఉత్సాహం చూపించినప్పటి నుంచి మోసాలు మొదలు పెడుతున్నారు. విమానాశ్రయ అధికారులు, ఆర్‌బీఐ ప్రతినిధులంటూ బాధితులకు ఫోన్లు చేస్తున్నారు. బహుమతులు విడిపించుకోవాలంటే రుసుం చెల్లించాలంటూ చెబుతున్నారు. రూ.లక్షలు నగదు బదిలీ చేయించుకున్నాక ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు.

ఇలాంటి ఘటనలు.. హైదరాబాద్‌ సహా బెంగళూరు, దిల్లీ, ముంబయి నగరాల్లో కొద్దిరోజులుగా ఇన్‌స్టా మోసాలు పెరుగుతున్నాయని సైబర్‌ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. నేరస్థులు వందల సంఖ్యలో నకిలీ ప్రొఫైల్స్‌ సృష్టించి ఇన్‌స్టా ఖాతాలు తెరిచారని పేర్కొన్న ఏసీపీ.. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్​ రిక్వెస్టులను పట్టించుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.